iDreamPost
android-app
ios-app

Wanted Movie : హిందీ పోకిరికి సీక్వెల్?

  • Published Apr 01, 2024 | 3:18 PM Updated Updated Apr 01, 2024 | 3:18 PM

మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి పోకిరి.ఆ సమయానికి వరుస ఫ్లాప్స్ తో స్లంప్ లో ఉన్న సల్మాన్ కు కమ్ బ్యాక్ ఇవ్వటమే కాక తన కెరీర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి పోకిరి.ఆ సమయానికి వరుస ఫ్లాప్స్ తో స్లంప్ లో ఉన్న సల్మాన్ కు కమ్ బ్యాక్ ఇవ్వటమే కాక తన కెరీర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

  • Published Apr 01, 2024 | 3:18 PMUpdated Apr 01, 2024 | 3:18 PM
Wanted Movie : హిందీ పోకిరికి సీక్వెల్?

మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి పోకిరి. మహేష్ బాబు – పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి సెన్సేషనల్ హిట్ అయింది. హీరో క్యారెక్టర్, డైలాగ్స్ పరంగా ఐకానిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడతో సహా పలు భాషల్లో రిలీజ్ అయి అక్కడ కూడా భారీ విజయం సాధించింది. పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ లో బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటించారు. ఆ సమయానికి వరుస ఫ్లాప్స్ తో స్లంప్ లో ఉన్న సల్మాన్ కు కమ్ బ్యాక్ ఇవ్వటమే కాక తన కెరీర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తాజాగా వాంటెడ్ సీక్వెల్ పై కొన్ని పుకార్లు వస్తున్నాయి.

అయేషా టకియా హీరోయిన్ గా నటించిన ఈచిత్రం 2009లో విడుదలయింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ తో పాటు దివంగత వినోద్ ఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటించారు. వాంటెడ్ సీక్వెల్ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత బోనీ కపూర్ దీనికి సంబందించిన ఒక అప్‌డేట్ ను షేర్ చేశారు. వాంటెడ్ 2కి సంబంధించి సల్మాన్ ఖాన్‌తో జరిగిన చివరి సంభాషణను నిర్మాత బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో, బోనీ కపూర్ సల్మాన్ ఖాన్‌తో వాంటెడ్ 2 గురించి ఒక మాట చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఆ పనులు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఇంకా తెలియదని చెప్పారు. “నేను ఎప్పుడు నిర్ణయించుకున్నా, సరైన స్క్రిప్ట్ దొరికితే వాంటెడ్ సీక్వెల్ చేస్తానని సల్మాన్ నాకు మాట ఇచ్చాడు” అని బోనీ చెప్పారు. కొత్త తారాగణంతో నో ఎంట్రీ సినిమా సీక్వెల్ గురించి కూడా ఆయనకి తెలియజేసినప్పుడు కూడా పాజిటివ్ గా స్పందించారని అన్నారు. “నాకు ఒక ఆలోచన ఉంది, నేను దానిని తొందరలోనే డెవలప్ చేస్తాను. కాబట్టి, ఏదో ఒక రోజు స్క్రిప్ట్ పూర్తిగా తయారవుతుంది. అది చాలా త్వరగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను,” అన్నారాయన.

Wanted

తెలుగులో కృష్ణ మనోహర్/పండు గా మహేష్ బాబు కనిపిస్తే సల్మాన్ ఖాన్ హిందిలో రాజ్‌వీర్ షెకావత్/రాధే పాత్రను పోషించారు. ఇక తెలుగు, హిందీ రెండు వెర్షన్లలోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఇక సల్మాన్ ఖాన్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. ఈద్ 2025 విడుదలకు ఈ సినిమా షెడ్యూల్ చేయబడింది. తాజాగా ఇదే విషయాన్ని ఖాన్ అధికారికంగా ప్రకటించారు. అది కాకుండా, సూపర్ స్టార్ ఇప్పటికీ విష్ణువర్ధన్ తో “ది బుల్‌”లో అనే సినిమా కూడా ప్రకటించారు. కాగా ఈ చిత్రాన్ని నిర్మించే భాధ్యత కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ తీసుకుంది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş