iDreamPost
android-app
ios-app

ముచ్చటగా మూడోసారి మెగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్..?

  • Author ajaykrishna Updated - 03:27 PM, Sat - 5 August 23
  • Author ajaykrishna Updated - 03:27 PM, Sat - 5 August 23
ముచ్చటగా మూడోసారి మెగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్..?

ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ కి ఉండే క్రేజ్ వేరు. ఒక డైరెక్టర్ కి, హీరోకి మధ్య ర్యాపో కుదిరిందంటే.. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా ఆదరించేందుకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతుందని టాక్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. వీరి కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు తెరపైకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాలకు.. వాటిలో మెగాస్టార్ క్యారెక్టర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యపోయే అవసరం లేదు.

2003లో వీరి కాంబినేషన్ లో ఠాగూర్ సినిమా రాగా.. దాదాపు 14 ఏళ్ళ గ్యాప్ తర్వాత.. అంటే 2017లో ఖైదీ నెంబర్ 150 తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. వసూళ్ల పరంగాను ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాలకు కామన్ పాయింట్ మాత్రం ఒకటి ఉంది. అదేంటంటే.. ఠాగూర్, ఖైదీ నెంబర్ 150.. ఈ రెండూ తమిళ సినిమాల రీమేక్ లే.ఆ రెండు సినిమాలు కూడా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ వే కావడం విశేషం. ఠాగూర్ మూవీ 2002లో విడుదలైన రమణకి రీమేక్ కాగా.. ఖైదీ నెంబర్ 150 మూవీ కత్తి మూవీకి రీమేక్.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మళ్లీ ఆరేళ్ళ తర్వాత మరోసారి చిరంజీవి, వినాయక్ ల కాంబోలో కొత్త సినిమా రానుందని ప్రచారం మొదలైంది. బజ్ అయితే ఉంది. కానీ.. అవునా కాదా? అనేది చిరు, వినాయక్ లే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి.. మెగా ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. ఎందుకంటే.. బాస్ తో వినాయక్ హిట్ ట్రాక్ కారణం. ప్రస్తుతం చిరు వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. భోళా శంకర్ మూవీ రిలీజ్ కి రెడీ చేశాడు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆగష్టు 11న ఆ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక వినాయక్ తో కొత్త ఉంటుందా లేదా అనేది భోళా శంకర్ రిలీజ్ తర్వాత క్లారిటీ వస్తుందేమో చూడాలి. మరి వీరి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

ఇదీ చదవండి: ఫలితాలు వచ్చేశాయి.. ఇంతకీ పవిత్ర లోకేష్ పరిస్థితి ఏంటంటే..?

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş