iDreamPost
android-app
ios-app

విశ్వంభర నుంచి క్రేజీ న్యూస్.. ఇంద్ర ఫీవర్ రిపీట్!

  • Published Aug 27, 2024 | 11:57 AM Updated Updated Aug 27, 2024 | 11:57 AM

Vishwambhara Movie Latest News: సాధారణంగానే చిరంజీవి సినిమాలంటే అందరికి ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Vishwambhara Movie Latest News: సాధారణంగానే చిరంజీవి సినిమాలంటే అందరికి ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Aug 27, 2024 | 11:57 AMUpdated Aug 27, 2024 | 11:57 AM
విశ్వంభర నుంచి క్రేజీ న్యూస్.. ఇంద్ర ఫీవర్ రిపీట్!

దర్శకుడు వశిష్ఠ , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ.. విశ్వంభర. సహజంగానే చిరంజీవి సినిమాల మీద ఉండే హైప్ కారణంగా ఈ సినిమాపై కూడా అందరికి అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇక రీసెంట్ గా చిరంజీవి బర్త్ డే సంధర్బంగా… ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేశారు. త్రిశులాం పట్టుకుని చిరు కనిపించిన తీరు చూసి.. అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక అదే రోజు.. చిరు బర్త్ డే గిఫ్ట్ గా .. ఇంద్ర సినిమాను కూడా రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ సినిమాలలో ఈ సినిమా కూడా కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సింక్ అయ్యేలా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ఇంద్ర సినిమాకు ఎప్పటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. రీసెంట్ గా థియేటర్స్ రీరిలీజ్ అయినా ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సమయంలో ఇంద్ర సినిమాకు ఎలాంటి హైప్ నడిచిందో.. ఇప్పుడు ఈ తరం వారు కూడా అదే రేంజ్ లో ఈ సినిమా రీరిలీజ్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై చిరు స్పందిస్తూ.. కొన్ని విషయాలు ముచ్చటించారు. అయితే చిరు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ ఉంటారని తెలిసిందే. సరదాగా సోషల్ మీడియా దానిని చిరు లీక్స్ అని అంటూ ఉంటారు. ఈ క్రమంలో విశ్వంభర గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను బయటపెట్టేశారు. అదేంటంటే.. విశ్వంభరలో.. ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉందని. అది ఇంద్రలోని భం భం భోలే సాంగ్ రేంజ్ లో ఉంటుందని హింట్ ఇచ్చేశారు. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Viswabara

చూడబోతుంటే విశ్వంభర మూవీ ఆల్బమ్ కూడా.. ఓ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.. అవి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలను పెంచుతాయో వేచి చూడాలి. ఒకవేళ అంచనాలకు తగినట్లు ఈ సినిమా హిట్ అయితే మాత్రం.. యంగ్ హీరోస్ అంతా తమ సినిమాలపై ఇంకాస్త ఫోకస్ పెంచాల్సిందే. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాల్సిందే. మరి ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet