iDreamPost
android-app
ios-app

Vishwak Sen: ఇన్ స్టా అకౌంట్ క్లోజ్.. కారణమేంటో చెప్పిన విశ్వక్!

  • Published Jul 29, 2024 | 10:58 AM Updated Updated Jul 29, 2024 | 10:58 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాను ఇన్ స్టాగ్రామ్ ఎందుకు క్లోజ్ చేశాడో తాజాగా రీజన్ వెల్లడించాడు. 'మెకానిక్ రాకీ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయానికి సంబంధించిన వివరాలు చెప్పుకొచ్చాడు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాను ఇన్ స్టాగ్రామ్ ఎందుకు క్లోజ్ చేశాడో తాజాగా రీజన్ వెల్లడించాడు. 'మెకానిక్ రాకీ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయానికి సంబంధించిన వివరాలు చెప్పుకొచ్చాడు.

  • Published Jul 29, 2024 | 10:58 AMUpdated Jul 29, 2024 | 10:58 AM
Vishwak Sen: ఇన్ స్టా అకౌంట్ క్లోజ్.. కారణమేంటో చెప్పిన విశ్వక్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఈ ఏడాది మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘గామీ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ మాస్ హీరో.. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ గా థియేటర్లలోకి రాబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో విశ్వక్ తాను ఇన్ స్టా గ్రామ్ ఎందుకు క్లోజ్ చేశాడో చెప్పుకొచ్చాడు.

విశ్వక్ సేన్ కొన్ని రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్లోజ్ చేశాడు. దాంతో అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక విశ్వక్ ఇన్ స్టా క్లోజ్ చేయడానికి కారణం ఓ నటి అని, యూట్యూబ్ గొడవలు అని చాలా మంది చాలా రకాలుగా రూమర్లను స్ప్రెడ్ చేశారు. కానీ అవన్నీ అబద్దాలని, నేను నా అకౌంట్ ను క్లోజ్ చేయాడానికి వేరే కారణం ఉందని తాజాగా మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ లో రిపోర్టర్ “మీరు ఏ నటి వల్ల ఇన్ స్టా క్లోజ్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టీవ్ గా ఉండట్లేదు?” అని ప్రశ్నించాడు. దానికి విశ్వక్ ఆన్సర్ ఇస్తు..

“నువ్వు అమ్మాయిల కోసం ఇన్ స్టాలో ఉంటావేమో.. కానీ నేను అభిమానుల కోసం ఉంటాను. అయినా.. నేను ఎవరో అమ్మాయి కోసం ఇన్ స్టా ఎందుకు క్లోజ్ చేస్తాను? అసలు నేను ఇన్ స్టా ఎందుకు డియాక్టివేట్ చేశానో తెలుసా? మార్చి 29న నాకు 30 సంవత్సరాలు వచ్చాయి. ఇంత ఏజ్ వచ్చినా కూడా.. ఇంకా గంటలు గంటలు ఫోన్ పట్టుకుని టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని, ఇన్ స్టా ను క్లోజ్ చేసి.. ఇంకాస్త ఎక్కువ పని చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే దాన్ని డియాక్టివేట్ చేశాను. సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు సోషల్ మీడియాలో ఉంటాను.. విడుదల తర్వాత వారం రోజులు ఉంటాను. ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపించను” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు విశ్వక్ సేన్.

ఇక మెకానిక్ రాకీ విషయానికి వస్తే.. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో SRT ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ తాళ్లూరి నిర్మించాడు. ఇందులో విశ్వక్ కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఒక ప్రేక్షకుడిగా నేను ఎలాంటి సినిమాలను చూడాలనుకుంటున్నానో.. అలాంటి కథలనే చేస్తూ వస్తున్నాను, ఈ మూవీ కూడా అలాంటిదే అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom