iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

  • Published Jul 29, 2024 | 9:08 AM Updated Updated Jul 29, 2024 | 9:08 AM

Uppalapati Suryanarayana Babu Passed away: ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.

Uppalapati Suryanarayana Babu Passed away: ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Jul 29, 2024 | 9:08 AMUpdated Jul 29, 2024 | 9:08 AM
మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ స్టార్ నటులు, దర్శక, నిర్మాతలు వారి కుటుంబ సభ్యులతోపాటు ఇతర సాంకేతిక రంగాల్లో పనిచేసేవారు వివిధ కారణాల వల్ల కన్నుమూస్తున్నారు. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. అనారోగ్య సమస్యలు, వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన మేనమామ, ప్రముఖ ప్రొడ్యూసర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట మరో విషాదం నెలకొంది. ఇటీవల ఆయన సోదరుడు రమేష్ బాబు, తర్వాత ఆయన తల్లి ఇందిరా, సూపర్ స్టార్ కృష్ణ వరుసగా కన్నుమూయడంతో తీవ్ర దుఖఃంలో ఉన్న మహేష్ బాబు మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. మహేష్ బాబు మేనమామ ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ బావమరిది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు(74) అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఈ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో జన్మించిన ఆయన సూపర్ స్టార్ కృష్ణ రెండవ సోదరి లక్ష్మి తులసితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. పద్మావతి ఫిలిమ్ బ్యానర్ పై తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 24 చిత్రాలు తెరకెక్కించారు. మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి, సంద్యా,బజారు రౌడీ వంటి సూపర్ హిట్ చిత్రాలు సూర్య నారాయణ బాబు నిర్మించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1985 లో గుడివాడ నియోజకవర్గం నుంచి యన్టీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరి పలు బాధ్యతలు నిర్వహించారు. సూర్యనారాయణ బాబు మరణంపై సినీ ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom