iDreamPost
android-app
ios-app

Gaami: గామిపై కోట్ల వర్షం.. 6 ఏళ్ల కష్టానికి ఇది సరైన ఫలితం

  • Published Mar 09, 2024 | 2:34 PM Updated Updated Mar 09, 2024 | 2:36 PM

విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా "గామి". మహా శివరాత్రి సంధర్బంగా ఈ సినిమాను మార్చి 8న థియేటర్స్ లో విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజే .. ఈ సినిమా గురించి అంతటా హిట్ టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా "గామి". మహా శివరాత్రి సంధర్బంగా ఈ సినిమాను మార్చి 8న థియేటర్స్ లో విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజే .. ఈ సినిమా గురించి అంతటా హిట్ టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 09, 2024 | 2:34 PMUpdated Mar 09, 2024 | 2:36 PM
Gaami: గామిపై కోట్ల వర్షం.. 6 ఏళ్ల కష్టానికి ఇది సరైన ఫలితం

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు పోటీ పడే హీరోలు ఎంతో మంది ఉన్నారు. అయితే, వీరందరిలో హీరో విశ్వక్ సేన్ రూట్ ఎప్పుడు వినూత్నంగానే ఉంటుంది. విశ్వక్ కథల ఎంపిక అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. ఇక సినీ ఇండస్ట్రీలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా.. మల్టీ టాలెంట్ తో తన ప్రతిభను కనబరుస్తూ ఉంటారు విశ్వక్. ఓ వైపు హీరోగా చేస్తూనే.. రచన, దర్శక నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉంటాడు విశ్వక్. ప్రస్తుతం ఈ హీరో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ “గామి”. మహా శివరాత్రి కానుకగా.. మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. మొదట ఈ సినిమాపైన ఎటువంటి భారీ అంచనాలు లేకపోయినా .. విడుదల తర్వాత మాత్రం “గామి” సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తోంది.

“గామి” సినిమా విడుదలైన మొదటి రోజునే .. హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే, ఈ సినిమా బడ్జెట్ మొత్తంగా రూ.24 కోట్లు అయినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్​తో కలుపుకొని ఓవరాల్​గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ జరిగింది. ఇక గామి విడుదలైన మొదటి రోజు రూ. 9.07 కోట్ల కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది. ఈ రకంగా చూస్తే.. మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా విశ్వక్ మంచి కథలను ఎంపిక చేసుకుని .. ప్రతి సినిమాలో తనదైన వెర్షన్ ను డిఫరెంట్ గా ఆడియన్స్ కు చూపిస్తూ ఉంటాడు. ఇలా అతను పడిన ఆరేళ్ళ కష్టానికి ఫలితంగా ఈరోజు గామి సినిమా నిదర్శనంగా నిలిచిందని చెప్పి తీరాలి. ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ టాక్ నడుస్తున్న క్రమంలో.. ఇప్పుడు వినిపిస్తున్న దానిని బట్టి చూస్తుంటే.. రానున్న రోజుల్లో గామి సినిమాపై కోట్ల వర్షం కురవడం ఖాయం.

ఇక విశ్వక్ సేన్ విషయానికొస్తే.. ఈ హీరో చేస్తున్న కొత్త ప్రయోగాలకు నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే. ఇప్పటివరకు విశ్వక్ సినీ హిస్టరీలోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన మూవీగా గామి నిలిచిపోయింది. ఇక ఇప్పుడు విశ్వక్ నెక్స్ట్ ఫిల్మ్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ సినిమాలో విశ్వక్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గామి సక్సెస్ తో .. విశ్వక్ నెక్స్ట్ ఫిల్మ్ పై ఇప్పుడు అందరికి భారీగా ఎక్స్పెక్టషన్స్ పెరిగిపోయాయి. ఈ సినిమాతో పాటు విశ్వక్ కు లైన్ అప్ లో మరో రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి, ఈసారి విశ్వక్ చేయబోయే ఫలితాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. మరి, ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్న గామి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş