Vikramarkudu Movie Villain: విక్రమార్కుడు మూవీ విలన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..?

విక్రమార్కుడు మూవీ విలన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి- రవితేజ కాంబోలో వచ్చిన మూవీ విక్రమార్కుడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రవితేజ డ్యూయల్ రోల్ చేశాడు. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..?

దర్శక ధీరుడు రాజమౌళి- రవితేజ కాంబోలో వచ్చిన మూవీ విక్రమార్కుడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రవితేజ డ్యూయల్ రోల్ చేశాడు. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..?

టాలీవుడ్ దర్శకుల్లో ఇప్పటి వరకు ఓటమి చవిచూడని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు 12 సినిమాలు తెరకెక్కించగా.. అన్నీ సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు మహేష్ బాబుతో రాబోతున్న సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆర్ఆర్ఆర్ మూవీ వరకు అతడి క్రేజ్ పెరిగింది. తెలుగు మీడియా నుండి అంతర్జాతీయ మీడియా కవర్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సునీల్, నాని, నితిన్, రవితేజ వంటి స్టార్స్ అతడితో వర్క్ చేసి ఫేమ్ పొందారు. రవితేజతో ఆయన రూపొందించిన మూవీ విక్రమార్కుడు. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ విక్రమ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు పోషించిన సంగతి విదితమే. ఈ మూవీ పేరు చెప్పగానే జింతాకా..జిత జిత గుర్తుకు వస్తుంది.

కేవలం 11 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ హిట్ అందుకోవడంతో ఎన్నో భాషల్లో రీమేక్ అయ్యింది. హిందీలో రౌడీ రాథోడ్‌గా, కన్నడ, తమిళం, బెంగాలీలోనే కాకుండా బంగ్లాదేశ్‌లో కూడా ఈ మూవీ టూ టైమ్స్ రీమేక్ అవ్వడం విశేషం. ఇందులో రవితేజ, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. అజయ్,  రాజీవ్ కనకాల, రుతిక, చత్రపతి శేఖర్, బ్రహ్మనందం, అమిత్ తివారీ, ప్రభాస్ శ్రీను వంటి కీలక పాత్రల్లో నటించారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ‘డమ్మారే డమ డమ, జుమ్ జుమ్ మాయ, కాలేజీ పాపల బస్సు, జోలాలి, వస్తావా వస్తావా ఒక్కసారి వస్తావా సాంగ్స్ వరకు అన్నీ హిట్స్ అందుకున్నాయి. ఇక ఇందులో బ్రహ్మానందం, రవితేజ కామెడీ ట్రాక్ ఎంత ఆకట్టుకుంటుందో.. విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్‌లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సెల్యూట్ చేసేలా నటించాడు.

ఇక ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో ఆకట్టుకున్ననటుడు గుర్తున్నారా.. భావుజీ క్యారెక్టర్‌లో నటించాడు. ‘ఒక్క ఫోన్ కొడితే.. ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎక్కడి నుండి వచ్చావో అక్కడికెళ్లి పడతావ్‘ అంటూ నొక్కి వక్కాణిస్తుంటాడు. అత్తిలి సత్తిబాబు విక్రమ్ రాథోడ్ గెటప్‌ మారాక విలన్‌కి షేక్ ఇస్తాడు. అంతలా తన నటనతో మెస్మరైజ్ చేసిన నటుడి పేరు వినీత్ కుమార్. బీహార్‌కు చెందిన ఆయన హిందీ చిత్రాల్లో నటించేవాడు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. విక్రమార్కుడిలో వచ్చిన క్రేజ్‌తో వరుస ఆఫర్లు వచ్చాయి. రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, నాయక్, ఆగడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, శివమ్, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం, ఇంటలిజెట్, టచ్ చేసి చూడు, ఆపరేషన్ 2019, చాణక్య, బంభాట్ వంటి చిత్రాల్లో కనిపించాడు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు.

Show comments