iDreamPost
iDreamPost
స్టార్ దర్శకుల వారసులు హీరోలుగా తెరంగేట్రం చేయడం కొత్త కాదు కానీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు తక్కువ. ఉదాహరణకు దాసరి నారాయణరావు గారు ఎంతో గ్రాండ్ గా అరుణ్ కుమార్ ఎంట్రీ ఇప్పిస్తే ఆయన కనీస స్థాయిలో నిలదొక్కుకోలేదు. ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఎన్నో ఇచ్చిన ఏ కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ ఫైనల్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మిగలాల్సి వచ్చింది. మాస్ సినిమాకు గ్రామర్ నేర్పించిన రాఘవేంద్ర రావు గారి కొడుకు ప్రకాష్ ని హీరోగా ఉషాకిరణ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా పరిచయం చేసినా ఫలితం దక్కలేదు. డైరెక్టర్ గానూ ఇతను ఆశించిన విజయాలను అందుకోలేపోయారు. ఇలా చెప్పుకోదగ్గ ఉదంతాలు ఉన్నాయి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లేటెస్ట్ గా దర్శకుడు తేజ తన వారసుడు అమితవ్ తేజ్ ని ఇవాళ లాంచ్ చేశారు. విక్రమాదిత్య టైటిల్ తో ప్రీ లుక్ పోస్టర్ ఇచ్చారు కానీ అందులో ఎలాంటి డిటైల్స్ కానీ హీరో ఫోటో కానీ ఏమి లేవు. కేవలం పీరియాడిక్ డ్రామా అనే సెన్స్ లో కాన్సెప్ట్ మాత్రమే చూపించారు. అఫీషియల్ గా అమితవ్ తేజ్ ని చూపించడానికి కొంత టైం తీసుకోవచ్చు. ఇప్పటికైతే అధికారికం కాదు. దీనికి నిర్మాత నల్లమలుపు బుజ్జి. దగ్గుబాటి రానా తమ్ముడు అభి రామ్ ని అహింసతో పరిచయం చేస్తున్న తేజ ఇలా బ్యాక్ టు బ్యాక్ డెబ్యూ మూవీస్ ని ప్లాన్ చేసుకోవడం విశేషం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవాళ డేట్ లో ప్రత్యేకతను తీసుకుని 2-2-2022నే స్టార్ట్ చేయడం అందులోనూ ఇదే తేదీన నితిన్ ని ఇంట్రో చేసిన జయం కూడా ఇదే తేదీ ప్రారంభం కావడం గమనించాల్సిన అంశం. నేనే రాజు నేనే మంత్రితో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ఆ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో రూపొందించిన సీత డిజాస్టర్ కావడం ట్విస్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి కొంత గ్యాప్ తీసుకున్న తేజ్ తర్వాత ప్లాన్ చేసుకున్న గోపిచంద్, రానాల ప్రాజెక్టులు ముందుకు వెళ్ళలేదు కానీ ఫైనల్ గా ఈ ఇద్దరితో లాక్ చేసుకున్నారు. మరి పైన నెగటివ్ సెంటిమెంట్ ని ఎలా బ్రేక్ చేస్తారో చూడాలి మరి.
Also Read : Acharya : ఆచార్యకు ముక్కోణపు ప్రేమకథ కాంపిటీషన్