iDreamPost
iDreamPost
కమల్ హాసన్ (Kamal Haasan) విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఫాహెద్ ఫాజల్ (Fahadh Faasil) నటించిన విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ గా సూర్య (Suriya) కనిపించడంతోనే విక్రమ్2 సీక్వెల్ మీద వర్క్ స్టార్ట్ అయినట్లు తెలిసిపోయింది. తమిళతెర మీద మరో క్రేజీ ఫ్రాంచైజీ తయారైంది. ఎక్స్ పాండబుల్స్ లాంటి క్రేజీ యూనివర్స్ ను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. క్రియేట్ చేసి, అందులో హీరోగా కమల్ హాసన్ ను ఉంచడంతోనే సీక్వెల్స్ కావాల్సిన స్టోరీ రెడీ అయిపోయింది.
దక్షిణాదిన ముగ్గురు యాక్టర్ హీరోలు కలసినటిచడంతోనే క్రేజ్ వచ్చేసింది. అందులోనూ ఖైదీలాంటి బ్లాక్ బస్టర్ ను తీర్చిదిద్దిన పేరు కనకరాజ్ ది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు క్రిటికల్ గా, ఇటు బ్లాక్స్ ఆఫీస్ పరంగా విక్రమ్ మూవీకి దేశవ్యాప్తంగా మంచి పేరువచ్చింది. హిందీలో పెద్ద హిట్ కొట్టకపోయినా, సీక్వెల్ కావాల్సిన ఉద్వేగాన్ని సృష్టించగలిగింది.
విక్రమ్ చూసిన వాళ్లకు, సినిమాలోని మజా అర్ధమైంది. సీక్వెల్ లో ఎవరు విలన్ ఎవరో హింట్ దొరికేసింది. ఇంకో సంగతి. ఖైదీ సినిమా హీరో కార్తీకూడా విక్రమ్ సీక్వెల్ లో రానున్నాడని, అతను సెకండ్ హీరోనని క్లారిటీ వచ్చేసింది.
మొత్తంమీద ఖైదీ సినీ యూనివర్స్ లో పార్ట్ గా విక్రమ్ 2 సినిమా మారనుంది. ఈ రెండు సినిమాలు త్వరలో మిక్స్ అవుతాయి. క్యారెక్టర్ ల మధ్య క్లారిటీ వస్తుంది. అందుకే విక్రమ్ 2కి స్క్రిప్ట్ రెడీ చేస్తుండగానే, విక్రమ్ 3కి కావాల్సిన ప్లాట్ ను రెడీ చేస్తున్నారన్నది తమిళ సినిమా టాక్. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ లోనే పూర్తికావచ్చు. అంటే అవతార్ సినిమా స్టైల్ లో. ఈ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేస్తారు. కాని ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేస్తారు.
ముందు విక్రమ్2 నా? ఖైదీ2 నా?
విక్రమ్ బ్లాక్ బస్టర్ కాబట్టి సహజంగా సీక్వెల్ కోసం డిమాండ్ ఉంటుంది. కాని ఖైదీ సినిమా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాత్రం ఇప్పటికే ఖైదీ2 అంటూ కనకరాజ్ పాత ట్వీట్ ను రీట్వీట్ చేశాడు. అంటే విక్రమ్ కి సీక్వెల్ కి ముందే ఖైదీ సీక్వెల్ రావాలన్నది నిర్మాత ప్లాన్. కాని కమల్ హాసన్ లాంటి స్టార్ తో పనిచేశాక కనకరాజ్ దృష్టి అంతా విక్రమ్ సీక్వెల్ ను తీర్చిదిద్దాలనే ఉందంట. కాని ఖైదీ నిర్మాత ఆలోచన వేరుగా ఉంది.
#Kaithi2 #Aarambikkalaangala!!😂🫣#Vikram https://t.co/5CZGNHKTTQ
— SR Prabhu (@prabhu_sr) June 2, 2022