Thangalaan Day 1 Collections: తంగలాన్ ఫస్ట్ డే కలెక్షన్స్! భారీ పోటీలోనూ విక్రమ్ ఊచకోత..

'తంగలాన్'.. చియాన్ విక్రమ్, పా. రంజిత్ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. మరి తొలిరోజు విక్రమ్ ఏ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టాడో చూద్దాం.

'తంగలాన్'.. చియాన్ విక్రమ్, పా. రంజిత్ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. మరి తొలిరోజు విక్రమ్ ఏ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టాడో చూద్దాం.

చియాన్ విక్రమ్.. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు ఈ స్టార్ హీరో. ఆ విషయం శివపుత్రుడు, అపరిచితుడు, ఐ మూవీలను చూస్తే తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు పా. రంజిత్ డైరెక్షన్ లో ‘తంగలాన్’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇక ఈ మూవీలో విక్రమ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి భారీ పోటీ మధ్య తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం పదండి.

‘తంగలాన్’.. చియాన్ విక్రమ్, పా. రంజిత్ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని రేకెత్తించాయి. దాంతో తంగలాన్ కు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సుమారు రూ. 65 కోట్ల మేర బిజినెస్ ను జరుపుకొన్నట్లు సమాచారం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటీవ్ టాక్ ను దక్కించుకుంది. ముఖ్యంగా విక్రమ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక తంగలాన్ మూవీ తొలిరోజు వసూళ్ల విషయానికి వస్తే.. విక్రమ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడులో రూ. 11 కోట్లు(15 కోట్ల గ్రాస్), తెలుగులో రూ. 1.5(3 కోట్ల గ్రాస్), మలయాళంలో రూ. 20 లక్షలు నికరంగా, కన్నడలో రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్ చేసింది. మెుత్తంగా తంగలాన్ మూవీ ఇండియాలో రూ. 20 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే విక్రమ్ రూ. 26 కోట్లను తొలిరేజే కొల్లగొట్టాడు. తెలుగులో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఉండటంతో.. విక్రమ్ ఎక్కువ డబ్బులు రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ.. తొలిరోజు ఆ రెండు సినిమాల కంటే ఎక్కువ వసూళ్లను సాధించాడు. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ. 66 కోట్ల షేర్ వసూళ్ చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి విక్రమ్ తొలిరోజు సాధించిన కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments