Somesekhar
తాను చేసిన చిన్న తప్పు వల్ల.. రెండు నెలలు ఏడుస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎవ్వరికీ తెలియని విషయాలను తాజాగా పంచుకున్నాడు చియాన్ విక్రమ్. మరి విక్రమ్ ఎందుకు రెండు నెలలు ఏడవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
తాను చేసిన చిన్న తప్పు వల్ల.. రెండు నెలలు ఏడుస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎవ్వరికీ తెలియని విషయాలను తాజాగా పంచుకున్నాడు చియాన్ విక్రమ్. మరి విక్రమ్ ఎందుకు రెండు నెలలు ఏడవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
చియాన్ విక్రమ్.. వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. అందుకోసం తన లుక్ ను ఎలా అంటే.. అలా ఛేంజ్ చేసుకుంటాడు. ఈ విషయం శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. ఇటీవలే ‘తంగలాన్’ అనే ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుసగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన చిన్న తప్పు వల్ల రెండు నెలలు ఏడుస్తూనే ఉన్నాని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
విక్రమ్.. ‘తంగలాన్’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక తంగలాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్.. కెరీర్ ఆరంభంలో తాను చేసిన ఓ తప్పు గురించి చెప్పుకొచ్చాడు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కలలు కంటూ ఉంటారు. అలాగే విక్రమ్ కు కూడా ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేదని తెలిపాడు. అయితే ఆ ఛాన్స్ చిన్న తప్పు వల్ల చేజారడంతో.. 2 నెలలు ఏడ్చాను అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
విక్రమ్ మాట్లాడుతూ..”మణిరత్నం అంటే నాకెంతో ఇష్టం. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలన్నది నా డ్రీమ్. నా కల తీరిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పడానికైనా నేను సిద్ధమే. ‘బొంబాయి’ మూవీలో నన్ను హీరోగా ఎంపిక చేశారు. కానీ, ఫైనల్ ఆడిషన్స్ లో నేను చేసిన చిన్న తప్పు వల్ల ఆ ఛాన్స్ చేజారిపోయింది. ఆడిషన్స్ లో స్టిల్ కెమెరా తీసుకొచ్చి.. సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారు. అయితే నేను.. స్టిల్ కెమెరా ముందు కదిలితే పిక్చర్ బ్లర్ గా వస్తుందనుకున్నా. దాంతో అలాగే నిలబడిపోయా. దాంతో నన్ను రిజెక్ట్ చేశారు. ఇక ఆ తర్వాత రోజు నుంచి రెండు నెలల పాటు ఏడుస్తూనే ఉన్నాను” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. విక్రమ్ నుంచి చేజారిన ఆ ఛాన్స్ అరవింద స్వామిని చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత విక్రమ్ కోరిక విలన్, పొన్నియన్ సెల్వన్ 1 ద్వారా నెరవేరింది.