iDreamPost
android-app
ios-app

తమన్నా గ్లామర్ షోపై ప్రియుడు విజయ్ వర్మ హాట్ కామెంట్స్!

  • Author ajaykrishna Published - 01:34 PM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 01:34 PM, Tue - 11 July 23
తమన్నా గ్లామర్ షోపై ప్రియుడు విజయ్ వర్మ హాట్ కామెంట్స్!

స్టార్ హీరోయిన్స్ ఒకరైన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు సౌత్ ఇండియాలో దాదాపు అందరు స్టార్స్ సరసన సినిమాలు చేసి.. మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కొన్నాళ్ళుగా సాలిడ్ హిట్ కోసం చూస్తున్న తమన్నా.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బోల్డ్ వెబ్ సిరీస్ లకు సైతం సంతకం పెట్టేస్తోంది. ఇప్పటికే జీ కర్దా, లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రెండింట్లోను బోల్డ్ రోల్స్ చేసింది. అలాగే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలలో మెరిసింది. ఇంకేముంది.. ఎన్నడూ లేనిది తమన్నాని అలా బోల్డ్ క్యారెక్టర్స్ లో చూసేసరికి అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో తమన్నా హాట్ షో పై ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలో తమన్నా ప్రియుడు, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.. రీసెంట్ గా తమన్నా చేసిన అందాల హాట్ షోపై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ తమన్నా హాట్ షో ఎక్కడ చేసింది అనుకుంటున్నారా.. దానికి సమాధానం సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న ‘జైలర్’ మూవీ. ఈ సినిమా నుండి ఇటీవల ‘కావాలా’ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో తమన్నా.. విచ్చలవిడిగా తన అందాలను కెమెరా ముందు పరిచేసింది. అనిరుధ్ పాటకు.. తమన్నా గ్లామర్ తోడై.. సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. అయితే.. ఈ సాంగ్ లో తమన్నా.. హాట్ మూవ్స్, పెర్ఫార్మన్స్ చూసి తన లవర్ విజయ్ వర్మ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం విజయ్ వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ప్రియురాలు తమన్నా డ్యాన్స్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. తన ప్రేమను వ్యక్తపరిచాడు విజయ్. తమన్నా అందం ఫైర్ అని చెప్పాడు. అదీగాక తమన్నా, సూపర్ స్టార్ రజినీ ఇద్దరూ దేవుళ్లు అంటూ కామెంట్ చేయడం విశేషం. మరి ప్రియుడి నుండి ప్రశంసలు అందుకున్న తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కానీ.. ఫ్యాన్స్ మాత్రం విజయ్ రియాక్షన్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. ఎంతైనా వాళ్లు లవర్స్ మధ్యలో మనమేం చేస్తామంటూ.. కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జైలర్ మూవీని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తుండగా.. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ లాంటి హేమహేమీలు నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss