iDreamPost
android-app
ios-app

Vijay Sethupathi & Katrina Kaif : ఊహించని కాంబోతో క్రైమ్ థ్రిల్లర్

Vijay Sethupathi & Katrina Kaif : ఊహించని కాంబోతో క్రైమ్ థ్రిల్లర్

కొన్ని కాంబినేషన్లు వినడానికి ఆశ్చర్యంగా ఉంటే ఒకవేళ అవి నిజమైతే ఇంకా షాకింగ్ గా ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా హిందీలో మేరీ క్రిస్మస్ అనే సినిమా రూపొందుతోంది. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ఆ మధ్య బ్లాక్ బస్టర్ అందాదున్ తీసింది ఈయనే. దీన్నే తెలుగులో నితిన్ మాస్ట్రోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇది హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకున్న విషయం తెలిసిందే. జానీ గద్దార్, బదలాపూర్ లాంటి విలక్షణ చిత్రాలతో శ్రీరామ్ రాఘవన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన ప్రతి సినిమాకు అంచనాలు పెరుగుతాయి.

ఇప్పుడీ మేరీ క్రిస్మస్ లాంటి విభిన్నమైన టైటిల్ కి ఈ కాంబోని సెట్ చేయడం విచిత్రమే. అయితే ఈ కథకు వీళ్లయితేనే న్యాయం చేయగలరని శ్రీరామ్ అంటున్నారు. విజయ్ సేతుపతికి మార్కెట్ పెరిగాక గ్లామర్ హీరోయిన్ల సరసన చేస్తున్నారు. లాభంలో ఆల్రెడీ శృతి హాసన్ తో చేయడం గుర్తే. త్వరలో విడుదల కాబోతున్న తమిళ మూవీలో నయనతార, సమంతా ఇద్దరూ తనకు జోడిగా నటించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏకంగా కత్రినా కైఫ్ తో సెట్ కావడం మాత్రం ఒక రకంగా సెన్సేషన్ అని చెప్పాలి.హిందీతో పాటు తమిళంలో కూడా ద్విబాషాల్లో అందించే ప్లానింగ్ లో ఉన్నాడు శ్రీరామ్ రాఘవన్.

ప్రతి స్క్రిప్ట్ కు చాలా టైం తీసుకుని హోమ్ వర్క్ చేసే రాఘవన్ సినిమాల్లో క్రైమ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ధీ కూడా ఊహించని రీతిలో ప్రెజెంట్ చేస్తారు. ట్విస్టులు మాములుగా ఉండవు. ఇలా ఎలా ఆలోచించారా అనేలా సాగుతాయి. మేరీ క్రిస్మస్ సైతం ఇదే ఫార్ములాతో ఉంటుందనే సందేహం అక్కర్లేదు. ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరైన విజయ్ సేతుపతికి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ కాల్ షీట్ల సమస్య వల్ల ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే పుష్పలో సునీల్ చేసిన క్యారెక్టర్ ని వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ చేసుంటే మాత్రం దాని లెవెల్ ఏ స్థాయిలో ఎలివేట్ అయ్యేదో వేరే చెప్పాలా

Also Read : Ticket Prices : టికెట్ రేట్ల సమస్య కొలిక్కి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి