iDreamPost
android-app
ios-app

‘The’ విజయ్ దేవరకొండ వెనుకున్న అసలు కథ చెప్పిన రౌడీ హీరో!

‘The’ విజయ్ దేవరకొండ వెనుకున్న అసలు కథ చెప్పిన రౌడీ హీరో!

విజయ్ దేవరకొండకు ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోవడానికి విజయ్ గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఖుషి సినిమాతో ఆ కోరిక నెరవేరే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా విడుదల చేసిన ఖుషి సినిమా ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక ప్యూర్, ఫ్రెష్ లవ్ స్టోరీని అందిస్తున్నాం అని శివ నిర్వాణ కూడా బలంగా చెబుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా పాన్ ఇండియా లెవల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఖుషి సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత దంపతుల జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి ఘటనలు ఎదురవుతాయి అనే కోణంలో తీసిన సినిమా. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. వాటికి విజయ్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. “గతంలో పెళ్లి గురించి మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. నా చట్టుపక్కల ఆ టాపిక్ వస్తే ఊరుకునే వాడిని కాదు. కానీ, ఇప్పుడు పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ పెళ్లిళ్లు జరుగుతుంటే ఎంజాయ్ చేస్తున్నాను” అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

అలాగే అసలు ది విజయ్ దేవరకొండ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు ది విజయ్ దేవరకొండగా పేరు మార్చుకున్నారు? అంటూ ప్రశ్నించగా.. “ది విజయ్ దేవరకొండ అనేది నేను కావాలి అని పెట్టుకున్నది కాదు. నిజానికి ఏమీ లేకపోతే వాళ్లకి ఇష్టమైన పేర్లు రాస్తున్నారు. రౌడీ స్టార అని, సౌత్ సెన్సేషన్ అని ఇలా రాసుకుంటూ పోతున్నారు. అందుకే నాకు ఒక పేరు పెట్టాలి అనుకున్నారు. లైగర్ సమయంలో పూరీ గారు రెండు, మూడు పేర్లు చెప్పారు. నాకు మా అమ్మానాన్న పెట్టిన పేర్లే చాలు అనుకున్నాను. పైగా విజయ్ దేవరకొండ అని ఎవరూ లేరు. నేను ఒక్కడినే ఉన్నాను. అందుకే The విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నాను” అంటూ ది వెనకున్న అసలు కథను విజయ్ రివీల్ చేశాడు. ప్రస్తుతం ఈ కథ తెలుసుకుని అందరూ విజయ్ దేవరకొండని పొగిడేస్తున్నారు. ఎందుకంటే లేనిపోని ట్యాగ్ లు తగిలించుకోవడం కంటే.. తన పేరునే కొనసాగించేందుకు ఇలా ది పెట్టుకోవడం బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet