iDreamPost
android-app
ios-app

తనను తానే కాపీ కొట్టుకున్న లోకేష్ కనగరాజ్.. ఇదిగో ప్రూఫ్!

  • Author singhj Published - 10:01 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 10:01 PM, Sat - 7 October 23
తనను తానే కాపీ కొట్టుకున్న లోకేష్ కనగరాజ్.. ఇదిగో ప్రూఫ్!

మూవీ లవర్స్ చూపంతా ఇప్పుడు ఒక సౌత్ సినిమాపై పడింది. అదే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్​లో వస్తున్న ‘లియో’. దళపతి విజయ్ నటిస్తున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ‘లియో’ నుంచి కొన్ని ప్రచార చిత్రాలు, పాటలు విడుదల అయ్యాయి. వాటితో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ రీసెంట్​గా రిలీజైన ట్రైలర్ అయితే మూవీ మీద ఎక్స్​పెక్టేషన్స్​ను ఒక రేంజ్​లో పెంచేసింది. ‘లియో’ ట్రైలర్​లో విజయ్​ను చూపించిన విధానం, యాక్షన్ సీక్వెన్సులు, సీనియర్ యాక్టర్స్ అర్జున్​, సంజయ్ దత్​ను ప్రెజెంట్ చేసిన స్టైల్ హైలైట్ అనే చెప్పాలి. ఇందులోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్​ ఆకట్టుకుంటున్నాయి.

‘లియో’ ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే టైమ్​లో ఈ విజయ్ మూవీకి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ట్రైలర్​ను బట్టి మూవీలో హీరో డ్యుయల్ రోల్స్​లో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘లియో’ ఒక హాలీవుడ్ మూవీకి కాపీ అనే వార్తలు కూడా వచ్చాయి. ‘ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ అనే సినిమాను ఇది పోలి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘లియో’ కోసం ఈ ఇంగ్లీష్ మూవీ నుంచి లోకేశ్ కనగరాజ్ ఇన్​స్పైర్ అయ్యాడని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘లియో’ విషయంలో మరో రూమర్ కూడా వినిపిస్తోంది.

‘లియో’ కోసం లోకేశ్ కనగరాజ్ ఏకంగా తాను డైరెక్ట్ చేసిన ఒక మూవీనే కాపీ చేశాడని నెట్టింట వినిపిస్తోంది. కమల్ హాసన్​తో తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాలోని చాలా సీన్లను లోకేశ్ మక్కీకి మక్కీ ‘లియో’లో దింపేశాడని టాక్. అయితే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఎందుకంటే ‘విక్రమ్’లోని సీన్లతో పాటు ‘లియో’ ట్రైలర్​లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ యాక్ట్ చేసిన చాలా సీన్లు ‘విక్రమ్’లోని కమల్, విజయ్ సేతుపతి సీన్లను పోలి ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో లోకేశ్ మీద ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. ఆయన తన సినిమాలను తానే కాపీ చేసుకుంటున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రిలీజ్​కు ముందే లోకేశ్ క్లారిటీ ఇస్తారో లేదా డైరెక్ట్​గా మూవీలోని కంటెంట్​తో సమాధానం చెబుతారో చూడాలి.

ఇదీ చదవండి: ‘అఖండ’ సినిమా థమన్ BGM లేకున్నా అద్భుతమే: బోయపాటి

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş