iDreamPost
android-app
ios-app

ఈసారి విజయ్ పై డిజాస్టర్ ఎఫెక్ట్ లేనట్లే..

  • Published Jul 30, 2025 | 11:23 AM Updated Updated Jul 30, 2025 | 11:23 AM

సాధారణంగా ఓ స్టార్ హీరో నుంచి వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటే.. ఆ తర్వాత సినిమాకు ఓపెనింగ్స్ కాస్త తక్కువే వస్తుంటాయి. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప వేగం పుంజుకోదు. కానీ ఈసారి విజయ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది.

సాధారణంగా ఓ స్టార్ హీరో నుంచి వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటే.. ఆ తర్వాత సినిమాకు ఓపెనింగ్స్ కాస్త తక్కువే వస్తుంటాయి. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప వేగం పుంజుకోదు. కానీ ఈసారి విజయ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది.

  • Published Jul 30, 2025 | 11:23 AMUpdated Jul 30, 2025 | 11:23 AM
ఈసారి విజయ్ పై డిజాస్టర్ ఎఫెక్ట్ లేనట్లే..

సాధారణంగా ఓ స్టార్ హీరో నుంచి వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటే.. ఆ తర్వాత సినిమాకు ఓపెనింగ్స్ కాస్త తక్కువే వస్తుంటాయి. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప వేగం పుంజుకోదు. కానీ ఈసారి విజయ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. విజయ్ లాస్ట్ మూవీ ఫ్యామిలీ మ్యాన్ ఎలాతని డిజాస్టర్ టాక్ సంపాదించుకుందో తెలియనిది కాదు. ఇక దానికంటే ముందు రిలీజ్ అయిన ఖుషి మూవీ గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకాస్త వెనక్కు వెళ్లినా ఇంతే సంగతి.. విజయ్ దేవరకొండ అంటే అందరికి గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి, గీత గోవిందం మాత్రమే..

ఇలాంటి రికార్డ్స్ ఉన్నా కూడా ఇప్పుడు విజయ్ నుంచి కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే..ఈ ఓపెనింగ్స్ మీద ఆ డిజాస్టర్ ఎఫెక్ట్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగేది వేరే.. కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ , ప్రీ లుక్స్ , అప్డేట్స్ అన్నీ కూడా సినిమాకు బూస్టప్ ఇచ్చేలానే ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఓవరాల్ గా సినిమా మీద పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది. పైగా ఇప్పుడు ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేదు. ఏకంగా రెండు వారాలా పాటు ఓపెన్ గ్రౌండ్ దక్కింది. సో మొదటి షో టాక్ కనుక బాగా వచ్చిందంటే ఇక తర్వాత షోస్ వేగం పుంజుకుంటాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలోని మేజర్ సిటీస్ లో కింగ్డమ్ షోస్ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ కు దూరంగానే ఉంది. అది కూడా ఓ రంకంగా మంచి మూవ్ అనే చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా రూ.7 కోట్ల మార్కును దాటేసిన‌ట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వరుసగా ప్లాప్పులు వచ్చినా కానీ ఇప్పుడు ఇలాంటి రెస్పాన్స్ రావడం విజయ్ మార్క్ ను చూపిస్తుంది. ఇక సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.