iDreamPost
android-app
ios-app

Vijay Deverakonda: ఆ మూవీతో రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. కెరీర్ లో తొలిసారి ఇలా!

  • Published Apr 26, 2024 | 5:09 PM Updated Updated Apr 26, 2024 | 5:09 PM

విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతడు ఇలా చేయడం తన కెరీర్ లో ఇదే తొలిసారి. మరి ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? పూర్తి వివరాలు..

విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతడు ఇలా చేయడం తన కెరీర్ లో ఇదే తొలిసారి. మరి ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? పూర్తి వివరాలు..

Vijay Deverakonda: ఆ మూవీతో రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. కెరీర్ లో తొలిసారి ఇలా!

టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన నటనతో, యాటిట్యూడ్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. అయితే గత కొంతకాలంగా ఇతడికి హిట్లు లేవు. లైగర్ డిజాస్టర్ కావడం, ఖుషీ యావరేజ్ గా ఆడటం, ఇక ఇటీవలే వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీకి కూడా ఫ్లాప్ కావడంతో.. విజయ్ డీలా పడ్డాడు. దీంతో ఇక తన పంథా మార్చాలని అనుకున్నాడో ఏమో? తెలీదు కానీ.. తన నెక్ట్స్ మూవీలో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం పరిశ్రమలో వైరల్ గా మారింది. మరి తర్వాత చిత్రంలో విజయ్ చేయబోతున్న ఆ రిస్క్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఓ హిట్ సినిమా కావాలి. వరుసగా మూడు చిత్రాలు అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవడంతో.. నిరాశలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు రౌడీ హీరో. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే? గౌతమ్ తిన్ననూరి మూవీతో తన కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ప్రయోగం చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట. అవును ఈ న్యూస్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా మూవీలో పాటలు కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అలాంటిది సాంగ్స్ లేకుండా సినిమా అంటే సాహసమనే చెప్పాలి. అయితే విజయ్ ఈ రిస్క్ తీసుకోవడానికి ప్రధాన కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి అతడు సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ అందించే బ్యాంగ్రౌండ్ మ్యూజికే మూవీని ఓ రేంజ్ కు తీసుకెళ్తుందని విజయ్ నమ్ముతున్నాడు. అదీకాక ఇలాంటి యాక్షన్ మూవీలో సాంగ్స్ పెడితే.. ఆ చిత్రం మూడ్, ఫ్లేవర్ దెబ్బతింటాయని డైరెక్టర్ భావించడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. మరి మూవీలో సాంగ్స్ లేకుండా విజయ్ రిస్క్ చేస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.