iDreamPost
android-app
ios-app

కల్కి 2898 ADలో విజయ్ దేవరకొండ.. ఏ పాత్రలో అంటే..?

Vijay Deverakonda in Kalki డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే..

Vijay Deverakonda in Kalki డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే..

కల్కి 2898 ADలో విజయ్ దేవరకొండ.. ఏ పాత్రలో అంటే..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్- నాగ్ ఆశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సలార్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుండి రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాలో కీ రోల్స్ చేస్తున్న స్టార్ల ఫస్ట్ లుక్ పోస్టర్ల రూపంలో రివీల్ చేయడంతో పాటు ట్రైలర్ రిలీజై ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి విదితమే. ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ అంటున్నారు. ఇక భైరవ రాక మాత్రమే మిగిలి ఉంది. బాక్సాఫీసు దగ్గర ఊచకోత మొదలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటి నుండే హంగామా చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో ఈ సినిమా హడావుడి మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

సుమారు 600 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కింది కల్కి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంది. హై ప్రొడక్ణ్ వాల్యూస్, ఇంటర్నేషననల్ మార్కెట్‌లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తుంది.  త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనుంది చిత్ర యూనిట్.  ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన స్టార్లు నటించగా.. బుజ్జికి ప్రముఖ నటి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చిన సంగతి విదితమే.

VD in Kalki

అయితే ఈ సినిమాలో వీరే కాకుండా మరి కొంత స్టార్ హీరోలు కూడా నటించనున్నారని ఎప్పుటి నుండో రూమర్ క్రియేట్ అవుతుంది. నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. అదే విజయ్ దేవరకొండ పాత్ర. మహా భారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్న అర్జునుడి పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడని ఓ బజ్ నడుస్తుంది. ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇది నిజమైతే.. మరో సారి హిట్టు పడినట్లే. ఎందుకంటే నాగ్ అశ్విన్ గత రెండు సినిమాల్లోనూ విజయ్ ఉన్నాడు. ఎవడే సుబ్రమణ్యం, మహానటిలో విజయ్ యాక్ట్ చేసిన సంగతి విదితమే. ఈ రెండు సినిమాలు హిట్ కొట్టాయి. అందుకే కల్కిలో కూడా విజయ్‌కు నాగ్ అశ్విన్ కీ రోల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి