iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్.. వారందరికీ ఉచితంగా

  • Published Mar 29, 2024 | 1:56 PM Updated Updated Mar 29, 2024 | 1:56 PM

దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం విజయ్ తిరుపతిలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడ అభిమానులకు విజయ్ భారీ ఆఫర్ ను ప్రకటించాడు. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.

దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం విజయ్ తిరుపతిలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడ అభిమానులకు విజయ్ భారీ ఆఫర్ ను ప్రకటించాడు. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Mar 29, 2024 | 1:56 PMUpdated Mar 29, 2024 | 1:56 PM
ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్.. వారందరికీ ఉచితంగా

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకుర్ కాంబీనేషనల్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , సాంగ్స్, గ్లిప్స్ అనేవి విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రెకెత్తించాయి. అంతేకాకుండా..తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ విడుదలై ఆడియాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ రిలీజై భారీ రెస్పాన్స్ రావడంతో పాటు.. యూట్యూబ్ లో ఏకంగా నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే..సాధారణంగా విజయ్ కు తన అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే తన సినిమాలు విడుదలకు ముందు విజయ్ అభిమానులతో కలవడం, వారితో మాట్లాడడం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం విజయ్.. తిరుపతిలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడ అభిమానులకు విజయ్ భారీ ఆఫర్ ను ప్రకటించాడు.

దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కోసం విజయ్ తిరుపతిలోని ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘నేను తిరుపతికి చాలాసార్లు వచ్చాను. కొండ మీదున్న ఆ స్వామివారిని దర్శించుకున్నాను. కానీ, ఎప్పుడు కూడా మిమ్మల్ని (అంటే అభిమానులను) కలవలేదు. అయితే ఇప్పుడు నా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్రమోషన్స్‌ను తిరుపతిలో ప్రారంభించడం చాలా సంతోషం ఉంది. ఇక ఈవెంట్‌లో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూసి దిల్ రాజుకు విపరీతమైన నమ్మకం ఉంటుంది. అందుకే ప్రతి సినిమా విడుదలయిన తర్వాత తిరుపతికి వస్తుంటారు. అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చిన్నగా తిరుపతిలో చేద్దామంటే ఓకే అన్నాను. కానీ ఇక్కడ చూస్తుంటే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా ఉందంటూ’ విజయ్ అన్నాడు.

ఇక దర్శకుడు పరశురామ్‌తో విజయ్ దేవరకొండ కలిసి చేసిన ‘గీతా గోవిందం’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌లో సినిమా అనగానే  ‘గీతా గోవిందం’ రేంజ్‌లో ఉంటుదని అభిమానులు అంచనాలను పెంచుకున్నారు.  అయితే ఈ విషయం పై విజయ్ మాట్లాడుతూ.. ‘ గీతా గోవిందం తర్వాత లెవెల్ ప్యాకేజ్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. కాగా, నేను గీతా గోవిందం చేసేటప్పుడు అందరూ యాక్షన్ సినిమానా అని అడిగారు. ఇక నేను యాక్షన్ సినిమా చేసినప్పుడు గీతా గోవిందం లాంటి సినిమానా అని అడిగారు. అన్నీ కలిపి ఈసారి మీ ముందుకు వస్తున్నాం. సినిమా మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం’’ అంటూ విజయ్ ఎంతో నమ్మకంగా చెప్పాడు.

కాగా,  ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం విజయ్ దేవరకొండ తిరుపతికి వస్తున్నాడని తెలియగానే చాలామంది ఫ్యాన్స్ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆ విషయాన్ని విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘నాకోసం బైక్‌పై వచ్చిన ఫ్యాన్స్ అందరికీ లీటర్ పెట్రోల్ కచ్చితంగా కొట్టించాలి. నేను తిరుపతి డిస్ట్రిబ్యూటర్‌ను రిక్వెస్ట్ చేస్తున్నాను. బైక్ మీద వచ్చిన బాయ్స్ అందరికీ మా తరపున లీటర్ పెట్రోల్ ప్లీజ్’ అని విజయ్ అన్నాడు. దీంతో సంతోషంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఎప్పుడు ఫ్యాన్స్‌ను కలిసినా వారికి ఏదో ఒక ఆఫర్ ఇవ్వడం విజయ్ కి అలావాటు. అయితే ఈసారి ఆయన అభిమానులకు పెట్రోల్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఇచ్చిన ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet