ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ లను కలెక్షన్స్ బట్టి డిసైడ్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమాలు యాభై, వంద, నూట యాభై రోజుల వరకు థియేటర్స్ లో ఆడేవి. దాంతో లాంగ్ రన్ లో కలెక్షన్స్ కవర్ అయ్యేవి కాబట్టి.. ఎంత వసూల్ చేసింది? అనేది పెద్దగా చర్చించుకునేవారు కాదు. సినిమా ఆడిన రోజులు బట్టి సెలెబ్రేషన్స్ జరిగేవి. కొన్నేళ్లుగా అలా జరగడం లేదు. సినిమా విడుదలైన వారంలోనే దాదాపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ సినిమాకు టాక్ కాస్త అటు ఇటుగా వస్తే.. వచ్చే వారం కొత్త రిలీజ్ లోపు ఎలాగైనా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్స్ సంఖ్య, సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది.
అదే హిట్, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. సినిమా ఊహించని విధంగా తక్కువ టైమ్ లో టార్గెట్ రీచ్ అయిపోతుంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన కొత్త సినిమా ‘ఖుషి’ టార్గెట్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. విజయ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాని డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. అయితే.. లైగర్ తర్వాత విజయ్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. దీంతో సినిమా బాక్సాఫీస్ లెక్కలపై ఫోకస్ పెడుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఖుషి.. ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరుపుకుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఖుషి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 50 కోట్లకు పైగా జరగగా.. రూ. 52 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గీతగోవిందం. 2018లో విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్ లో సుమారు రూ. 50 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది. అప్పటినుండి ఆ రికార్డుని విజయ్ చేసిన ఏ మూవీ కూడా రీచ్ అవ్వలేకపోయాయి. సో.. ఇప్పుడు గీతగోవిందం మూవీ లాంగ్ రన్ లో వసూల్ చేసిన షేర్.. ఇప్పుడు ఖుషికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా సెట్ అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన ఐదేళ్ల క్రితం గీతగోవిందం సెట్ చేసిన వసూళ్లను.. ఇప్పుడు ఖుషితో అయినా బ్రేక్ చేస్తాడేమో చూడాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఖుషి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Kushi theatrical business is huge despite #VijayDeverakonda‘s recent track record. None of his films fared well post Geetha Govindam, but the pre release business of #Kushi is done keeping #GeethaGovindam closing business as the benchmark! #SamanthaRuthPrabhu#KushiOnSep1st
— Gulte (@GulteOfficial) August 16, 2023