నన్ను ఇన్స్పైర్ చేసేవి అవి రెండు మాత్రమే: విజయ్ దేవరకొండ

  • Author ajaykrishna Published - 03:24 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Published - 03:24 PM, Thu - 31 August 23
నన్ను ఇన్స్పైర్ చేసేవి అవి రెండు మాత్రమే: విజయ్ దేవరకొండ

ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. అవి ఒక్కొక్కరి లైఫ్ లో.. ఒక్కో విధంగా ఉంటాయి. కొందరికి జీవితంలో డబ్బు.. ఇంకొందరు చదువు.. మరికొందరు సమాజంలో గౌరవం.. ఇంకా కొందరు లవ్, ఫేమ్ చూసి ప్రేరణ పొందుతుంటారు. అలాగే తన లైఫ్ లో కూడా ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేసే అంశాలు రెండు ఉన్నాయని అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ వివరాల్లోకి వెళ్తే.. విజయ్, సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా.. ఖుషి సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా.. పాటలు, ట్రైలర్ లతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

కొద్దిరోజులుగా విజయ్.. ఖుషి అంతా కూడా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ పాటలు ఓవైపు వైరల్ అవుతుండగా.. మరోవైపు విజయ్ – సమంతల కెమిస్ట్రీ అందరిని అట్రాక్ట్ చేస్తోంది. అయితే.. రిలీజ్ కి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండటంతో.. విజయ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా తనను లైఫ్ లో ఇన్స్పైర్ చేసే అంశాల గురించి ఓపెన్ గా మాట్లాడాడు. మిమ్మల్ని లైఫ్ లో బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు.. “నా లైఫ్ లో డబ్బు, మర్యాద ఇవి రెండే చిన్నప్పటి నుండి ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నాయి. అంతేగాని నాకు ఎవరి ఇన్స్పిరేషన్ అవసరం లేదు” అని చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనరల్ గా లైఫ్ లో మోటివేట్ చేసే అంశాలు చాలా ఉంటాయి. కానీ.. డబ్బు అనేది ఎవరు పెద్దగా చెప్పరు. గతంలో కింగ్ షారుఖ్ ఖాన్ ఒక్కడే ఓపెన్ గా.. తనను డబ్బు మాత్రమే ఇన్స్పైర్ చేసిందని చెప్పాడు. ఇన్నాళ్లకు మళ్లీ విజయ్ నోటినుండి ఈ మాట వినిపించడంతో ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. సాధారణంగా అందరికీ డబ్బే కావాలి.. కానీ, ఫేమ్ లో ఉన్నాం కదా.. జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోతారేమో అని అందరు బయటికి చెప్పలేరు. అదనంగా వేరే ఏవేవో చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. లైగర్ తో భారీ డిజాస్టర్ ని చవిచూసిన విజయ్.. ఇప్పుడు ఖుషితో సక్సెస్ కొట్టాలని ఆశతో ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక విజయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Show comments