iDreamPost
android-app
ios-app

ఎలాగైతేనేం రష్మికతో పెళ్ళి…దేవరకొండ చెప్పాడుగా

Vijay Devarakonda, Rashmika Mandanna Marriage: ఎన్నో రీల్స్ కపుల్స్.. రియల్ కపుల్స్ గా మారాయి. తాజాగా వరుణ్-లావణ్యలో జంట కూడా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి విదితమే. ఇప్పుడు మరో రీల్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా వెల్లడించాడు.

Vijay Devarakonda, Rashmika Mandanna Marriage: ఎన్నో రీల్స్ కపుల్స్.. రియల్ కపుల్స్ గా మారాయి. తాజాగా వరుణ్-లావణ్యలో జంట కూడా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి విదితమే. ఇప్పుడు మరో రీల్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా వెల్లడించాడు.

ఎలాగైతేనేం రష్మికతో పెళ్ళి…దేవరకొండ చెప్పాడుగా

తెలుగు సినిమాలు ఎప్పుడైతే పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయాయో, యాక్టర్ల మైండ్ సెట్ కూడా పూర్తిగా పాన్ ఇండియా షేఫ్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనసు విప్పడానికి ఇష్టపడరు. ఇక్కడ మీడియాతో మాట్లాడడానికి మనసొప్పదు. మరేమో….ఇక్కడి మీడియాకి అంత సీన్ లేదనుకుంటారో…..కంట్రీ వైడ్ మీడియా అయితే ఆ క్రేజ్ వేరే అనుకుంటారో గానీ చాలా ఆంతరంగిక విషయాలను నేషనల్ మీడియాలోనైతేనే మనసు విప్పి చెబుతున్నారు. దేవరకొండ విజయ్ ది కూడా సేమ్ రూట్. ఇక్కడ చాలా మంది ఆరా తీయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. రష్మిక మందానాతో పెళ్లి విషయం గురించి చాలా రోజులు గోప్యంగానే ఉంచుకున్నారు ఇద్దరికిద్దరూ.

ఆ మధ్య నాని సినిమా ప్రీ రిలీజ్ పబ్లిసిటీ కేంపైన్ టైంలో కూడా దేవరకొండ విజయ్, రష్మిక మందానాల ఫొటోలు జంటగా కనిపించినప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తునే హల్చల్ చేసింది. అదిగో మేం ఎప్పుడో చెప్పాం అని కొందరు కాలరెత్తుకుని మరీ ఘోషించారు. నాని సినిమా పబ్లిసిటీ మూలన పడిపోయి, ఈ వార్త బాగా డామినేట్ చేయగానే, నాని వెంటనే అప్రమత్తమై అదేదో పొరబాటుగా జరిగిపోయిందని ట్వీట్ లాంటిదేదో కూడా చేయవలసి వచ్చింది. తీరా ఇప్పుడు అదే నిజమైంది. దేవరకొండ ఇక్కడ కాదు, నేషనల్ మీడియాతో బాహాటంగానే ఒప్పేసుకున్నాడు. రష్మికతో ఫెళ్ళి విషయాన్ని కరెక్టేనని అంగీకరిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఉప్పు అందగానే నేషనల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడి, సూపర్ ఫాస్ట్ స్పీడుతో ఈ వార్తని వీర లెవెల్లో వైరల్ చేసేసింది. ఫిబ్రవరి నెలలో నిశ్చితార్ధం అనేది వార్తలో ముఖ్యభాగం అనమాట. నార్త్ లో ఓ ప్రముఖ మేగ్జైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో దేవరకొండ ఈ సమాచారాన్ని పరిగెత్తించాడు. మొత్తానికి ఎలాగైతేనేం…ఇక్కడో అక్కడో దేవరకొండ విషయాన్ని తేటతెల్లం చేసి అందరినీ శాంతింపజేశాడు. లేకపోతే ఏవో ఒక రకమైన వ్యాఖ్యానాలతో దేవరకొండ, రష్మిక మందానాల పెళ్లి విషయాన్ని లీక్ చేయడానికి పడే తాపత్రయానికి ఇప్పుడో దారి తెన్నూ దొరికాయన్నది సారాంశం.

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş