iDreamPost
android-app
ios-app

కూతుర్ని తలచుకొని విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్!

  • Author singhj Updated - 12:00 PM, Fri - 3 November 23
  • Author singhj Updated - 12:00 PM, Fri - 3 November 23
కూతుర్ని తలచుకొని విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్!

తమిళంతో పాటు తెలుగు నాట కూడా మంచి పాపులారిటీ కలిగిన నటుల్లో ఒకరు విజయ్ ఆంటోని. టాలీవుడ్​లో పలు మూవీస్​కు మ్యూజిక్ అందించిన ఆయన.. హీరోగానూ అలరించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన నటించిన ‘బిచ్చగాడు’, ‘డాక్టర్ సలీం’, ‘నకిలీ’ చిత్రాలు తెలుగునాట మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘బిచ్చగాడు’ అయితే డబ్బింగ్ మూవీస్​లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా రిలీజైన ఈ ఫిల్మ్ డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఇటీవల ‘బిచ్చగాడు 2’తో మరో హిట్​ను తన అకౌంట్​లో వేసుకున్నారు విజయ్ ఆంటోని.

‘బిచ్చగాడు 2’ హిట్​తో ఆనందంలో ఉన్న విజయ్ ఆంటోని కుటుంబంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు మీరా సెప్టెంబర్ 20న సూసైడ్ చేసుకున్నారు. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కూతురి మరణంతో విజయ్ ఆంటోని కుంగిపోయారు. కూతురితో పాటు తాను కూడా చనిపోయానంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్న ఆయన తిరిగి తన పనుల్లో మునిగిపోయారు. తన కూతురు మరణించినా సినిమా యూనిట్ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రమోషన్స్ కోసం కూడా బయటకు వచ్చారు. ఇక మీదట తాను చేసే సేవా కార్యక్రమాలన్నీ మీరా పేరు పైనే చేస్తానని ఆయన వెల్లడించారు.

విజయ్ ఆంటోని భార్య ఫాతిమా మాత్రం కూతురి మరణాన్ని ఇంకా జీర్ణించుకున్నట్లుగా కనిపించడం లేదు. మీరాను తలచుకుంటూ ఫాతిమా తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందర్నీ కదిలిస్తోంది. ‘16 ఏళ్లకే నువ్వు చనిపోతావని తెలిస్తే.. నిన్న అనుక్షణం నా దగ్గరే పెట్టుకునేదాన్ని. ఈ ప్రపంచాన్ని, సూర్యచంద్రుల్ని కూడా నీకు చూపించేదాన్ని కాదు. ప్రతీక్షణం నీ ఆలోచనలతోనే చచ్చిపోతున్నా. నువ్వు లేకుండా బతకడం నా వల్ల కావట్లేదు. మా కోసమైనా నువ్వు తిరిగి రా. నీ కోసం చెల్లి ఎదురు చూస్తోంది’ అంటూ ఫాతిమా ఎమోషనల్ అయ్యారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. మేడం మీరు బాధకండి అంటూ ఓదారుస్తున్నారు.

ఇదీ చదవండి: కృష్ణంరాజు విగ్రహాన్నిచూసి ప్రభాస్ ఒక్కసారిగా ఉలికి పడ్డాడు: శ్యామలా దేవి

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş