iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి పరిస్థితి విషమం.. ICU లో చికిత్స!

  • Published Dec 20, 2023 | 12:32 PM Updated Updated Dec 20, 2023 | 12:34 PM

Hema Chaudhary: ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమ అభిమాన నటీనటులు ఆస్పత్రిలో చేరడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Hema Chaudhary: ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమ అభిమాన నటీనటులు ఆస్పత్రిలో చేరడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  • Published Dec 20, 2023 | 12:32 PMUpdated Dec 20, 2023 | 12:34 PM
ప్రముఖ నటి పరిస్థితి విషమం.. ICU లో చికిత్స!

ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరుతున్నారు. కొంతమంది వయోభారంతో అయితే.. మరికొంతమంది హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలకు గురై ఆస్పత్రిలో చేరుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గుండెపోటుతో పలువురు సినీ సెలబ్రెటీలు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి హేమా చౌదరి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ కన్నడ నటి హేమా చౌదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నటి నటి హేమా చౌదరి బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బెంగళూరు బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు. ఆమె కొడుకు ఐర్లాండ్ లో ఉంటున్నారు.. ఈ విషయం అతనికి చేరవేయడంతో కొడుకు బయలుదేరినట్లు తెలుస్తుంది. ఇటీవలే లీలావతి పుణ్య‌తిథి నాడు నటి హేమా చౌదరి ఆరోగ్యంగానే  సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన హేమా చౌదరి 180కి పైగా సినిమాల్లో నటించింది.

kannada actress join in hospital

వెంపటి చిన్న సత్యంతో ప్రపంచ వ్యాప్తంగా 700 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు.  చెన్నైలో రజినీకాంత్ తో కలిసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో పట్టభద్రురాలయ్యింది. జాతీయ చలనచిత్ర కమిటీ అవార్డులో మూడు సంవత్సరాలు పనిచేశారు. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది హేమా చౌదరి. ఒక్క కన్నడ భాషలోనే దాదాపు 91 సినిమాల్లో నటించి మెప్పించింది.  ఆమె 1976లో పెళ్లి కాని పెళ్లి అనే తెలుగు చిత్రంతో తన కెరీర్ ని ప్రారంభించింది. విజయ వాణి, సుభాషయ, దీప, గాలి కావలా, నీ నవలా వంటి కన్నడ చిత్రాలలో నెగిటివ్ రోల్స్‌లో అద్భుతంగా నటించింది. తెలుగు లో కూడా కొన్ని చిత్రాల్లో నెగిటీవ్ పాత్రల్లో నటించింది. సుందరకాండ, ప్రేమ విజేత, పుట్టింకి రా చెల్లి, గోరింటాకు వంటి చిత్రాల్లో నటించారు. ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.