iDreamPost
android-app
ios-app

సూపర్ కాంబో సాధ్యపడటం లేదు

  • Published May 25, 2022 | 4:23 PM Updated Updated May 25, 2022 | 4:23 PM
  • Published May 25, 2022 | 4:23 PMUpdated May 25, 2022 | 4:23 PM
సూపర్ కాంబో సాధ్యపడటం లేదు

తెలుగులో వచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్స్ లిస్ట్ చెప్పమంటే అందులో ఖచ్చితంగా ఉండే పేర్లు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులకు వెంకటేష్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ మెప్పించేసింది. అయితే మాటల మాంత్రికుడు వీటికి కేవలం సంభాషణలు మాత్రమే అందించారు. సక్సెస్ క్రెడిట్ లో సింహభాగం దర్శకుడు విజయ్ భాస్కర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయాక మళ్ళీ వెంకీ త్రివిక్రమ్ లు కలిసే అవకాశం దక్కలేదు. వాసుకి కలిసి పనిచేశారు కానీ దానికి డైరెక్టర్ కరుణాకరన్. నువ్వే నువ్వేతో త్రివిక్రమ్ దర్శకుడయ్యాక వెంకటేష్ తో ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటిదాకా చేయలేకపోయారు.

తాజాగా ఎఫ్3 ఇంటర్వ్యూలో వెంకటేష్ మాట్లాడుతూ సితార బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నానని అయితే త్రివిక్రమ్ చాలా బిజీగా ఉండటంతో వేరే కథ దర్శకుడి కోసం వెతుకుతున్నామని తేల్చి చెప్పేశారు. సో ఈ కాంబో ఇప్పట్లో సాధ్యం కాదనే క్లారిటీ వచ్చేసినట్టే. త్రివిక్రమ్ మహేష్ బాబు 28 పూర్తి చేశాక ఎవరికి కమిట్ అయ్యారో బయటికి చెప్పడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి రెండు పేర్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తో చేయాలన్న టార్గెట్ కూడా లేట్ అవుతోంది. మరి ఈ ముగ్గురిని దాటాక ఇంకెవరితో టై అప్ అవుతారో తెలియదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే వెంకటేష్ ఇప్పట్లో మా కలయిక ఉండదని తేల్చి చెప్పారు.

ఈ కారణంగా హారికా హాసిని బదులు సితారలో తన సినిమా ఉంటుందని చెప్పారు. అయితే భీమ్లా నాయక్ టైపు లో డైరెక్షన్ వేరొకరికి ఇచ్చి త్రివిక్రమ్ తను మాటలు రాసే అవకాశం లేకపోలేదు. కాకపోతే కథ కుదరాలి. ఎఫ్3 తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కభీ ఈద్ కభీ దీవాలి. ఇందులో సల్మాన్ ఖాన్ అన్నయ్యగా నటించబోతున్నాడు. మొన్నటి దాకా ఇది ప్రచారంలో ఉంది కానీ అఫీషియల్ గా వెంకీ కన్ఫర్మ్ చేశారు. సో ఓ నాలుగు నెలలు ఇందులో బిజీ అయిపోతారు. తరుణ్ భాస్కర్ తో చేయాల్సింది సాగడం లేదు. జాతరత్నాలు ఫేమ్ అనుదీప్ స్టోరీ ఒకటి ఓకే అయ్యింది కాబట్టి నెక్స్ట్ అదే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio