iDreamPost
iDreamPost
ఈ మధ్య కాలంలో మన స్టార్లకు నార్త్ లో దక్కుతున్న గుర్తింపుని చూసి అక్కడి దర్శకులు తమ సినిమాల్లో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అఫ్కోర్స్ అక్కడి హీరోలూ మనతో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు లెండి. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్, గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ లు ఈ కారణంగానే క్యామియోలు చేశారు. పుష్ప 1, KGF 2లకు దక్కిన సక్సెస్ మన మార్కెట్ పరిధిని ఎంతగా పెంచిందో కళ్లారా చూస్తున్నాం. ఇక అసలు విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. స్ట్రెయిట్ హిందీ మూవీ చేసి మూడు దశాబ్దాలు దాటింది కాబట్టి ఇది సంథింగ్ స్పెషల్ న్యూస్ గా నిలవబోతోంది.
సల్మాన్ హీరోగా ఫర్హాద్ సాంజి దర్శకత్వంలో రూపొందబోయే కభీ ఈద్ కభీ దీవాలి(Kabhi Eid Kabhi Diwali)లో వెంకటేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు ముంబై మీడియా కథనం. ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తరచు ముంబై హైదరాబాద్ లో కలుసుకుంటూనే ఉంటారు. డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు వెంకీ అయితే ఆ పాత్రకు మంచి ఛాయస్ అని సల్లు భాయ్ సూచించారట. ఆయనే స్వయంగా అడిగితే విక్టరీ హీరో మాత్రం ఎందుకు వద్దంటాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ (pooja hegde). ఇప్పటికే ప్రారంభం కావడంలో విపరీతమైన జాప్యానికి గురైన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలు ఎక్కనుంది.
వెంకటేష్ 90 దశకంలో రెండు హిందీ సినిమాలు చేశారు. మొదటిది చంటి రీమేక్ అనారి. తెలుగు అంత కాకపోయినా అక్కడా మంచి విజయం సాధించింది. రెండోది యమలీల రీమేక్ తక్దీర్ వాలా. ఇది డిజాస్టర్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఎప్పుడూ బాలీవుడ్ మూవీ గురించి ఆలోచించలేదు. అడపాదడపా డబ్బింగ్ అయ్యాయి కానీ ఏవీ విజయం సాధించలేదు. ఎఫ్2 డబ్బింగ్ ఓ మోస్తరుగా బాగానే వెళ్ళింది. ఇప్పుడీ సల్మాన్ మూవీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అయినట్టే అని చెబుతున్నారు. ఎఫ్3 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ ఇంకా కొత్త కమిట్ మెంట్స్ కన్ఫర్మ్ చేయలేదు. అన్ని చర్చల్లో ఉన్నాయి