Venkateswarlu
డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ రిలీజ్ కానుంది. మొన్న సలార్‌కు సంబంధించి సెకండ్ ట్రైలర్ వచ్చింది. మొదటి దాన్ని మించి రెండో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సలార్ మూవీ రిలీజ్ కానుంది. మొన్న సలార్‌కు సంబంధించి సెకండ్ ట్రైలర్ వచ్చింది. మొదటి దాన్ని మించి రెండో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Venkateswarlu
ప్రముఖ తెలుగు దర్శకుడు వెంకటేష్ మహా.. ప్రశాంత్ నీల్ సినిమాలకు మధ్య గత కొంత కాలం నుంచి గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమాలపై కొన్ని విమర్శలు చేశారు. ‘‘ ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకుని గొప్పోడివి కావాలి అంటుంది. ఆ సినిమాలో తల్లి మాత్రం ఓ పెద్ద వస్తువు కావాలని కొడుకుని అడుగుతుంది. హీరో దాన్ని తవ్వే వాళ్లను ఉద్దరిస్తాడు. ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు.
వాడంత పిచ్చోడు ఎవడైనా ఉన్నాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే ఆమెను కలవాలనుంది. ఇలాంటి కథను సినిమా తీస్తే మనమంతా చప్పట్లు కొడుతున్నాం’’ అంటూ తీవ్ర స్థాయిలోనే మండిపడ్డారు. దీంతో యశ్ ఫ్యాన్స్‌తో పాటు కొంతమంది నెటిజన్లు కూడా వెంకటేష్‌పై సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. ఆ ట్రోల్స్ ధాటికి తట్టుకోలేక వెంకటేష్ తన వ్యాఖ్యలపై ఓ క్లారిటీ ఇచ్చాడు. అయినా ఆ ట్రోలింగ్స్ ఆగలేదు. మొన్నీ మధ్య కూడా పాత వివాదంపై మాట్లాడాడు.
అసలు ఆ రోజు ఆ సినిమా గురించి చర్చ జరగలేదని అన్నారు. ఏదో విషయం గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా గురించి చెప్పానన్నారు. అదంతా ఎడిట్‌లో లేదని, తాను ఓ ప్రశ్న సంధించే స్పేస్‌లో ఆ సంభాషణ జరిగిందని అన్నారు. ఈ క్లారిటీతో కూడా ఆయనపై విమర్శలు ఆగలేదు. గత కొంత కాలం నుంచి ఓ మోస్తరుగా తగ్గాయి. ఇలాంటి ఈ సమయంలో మరోసారి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా, సలార్ ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌పై వెంకటేష్ మహా స్పందించారు.
డంకీ సినిమాను తొలి రోజు మొదటి ఆటకే చూడాలని వేచి చూస్తున్నానన్నారు. తన అభిమాన నటుడు షారుక్ ఖాన్, తన అభిమాన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో డంకీ వస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. డంకీ సినిమా సెన్సార్ బోర్డు స్క్రీన్ సమయంలో చూసిన అధికారులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారనే విషయం తనకు మరింత ఆనందంగా ఉందన్నారు. ఇదే నిజమైతే..సినీ ప్రేక్షకులకు డంకీ సినిమా భావోద్వేగాలను పంచుతుందని అనుకొంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. వెంకటేష్ మహా కావాలనే ఈ పోస్టు పెట్టినట్లు అందరూ భావించారు. ట్రోలింగ్స్ మొదలెట్టారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాలు ఒకే సారి వస్తుండటం వల్ల మీ నా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ ట్వీటు చేయటంలో చెడు ఉద్ధేశ్యం లేదు. నేను ప్రభాస్ ఫ్యాన్‌ను. ఆయనతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ట్రైలర్ అద్భుతంగా ఉంది’’ అని అన్నాడు. అయినా ట్రోలింగ్స్ ఆగకపోవటంతో తన ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేశాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.