Swetha
గేమ్ ఛేంజర్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పడూ చరణ్ కు పోటీగా చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పడూ చరణ్ కు పోటీగా చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
2025 సంక్రాంతి పండుగ ఇప్పటినుంచే మొదలైంది. అదే సినిమాల పండగ.. అసలు సంక్రాంతి అంటేనే సినిమాల పండగ కదా. ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆల్రెడీ ముందే పండక్కి కర్చీఫ్ వేసిన విశ్వంభర రేస్ నుంచి తప్పుకుంది. ఈ ప్లేస్ లో ఎవరు ఊహించని విధంగా గేమ్ ఛేంజర్ వచ్చి కూర్చుంది. అసలు ఇరకాటం అప్పుడు మొదలైంది. చిరు కాబట్టి కొడుకు కోసం తగ్గాడు. మరి మిగిలిన వారు అలా కాదు కదా.. సంక్రాంతికి వస్తున్నాం అంటూ గట్టిగా పట్టుబట్టారు. ఎంతలా అంటే ఏకంగా ఆ మాటనే సినిమా టైటిల్ గా పెట్టేశారు. ఎంతైనా వారికి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది కదా మరీ.
వెంకటేష్ 76వ సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇది వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న మూవీ. నిన్న మొన్నటి వరకు చరణ్ కోసం ఇంకా ఎవరు డ్రాప్ అవుతారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి.. వెంకటేష్ మూవీ డ్రాప్ అవ్వచ్చేమో అనుకున్నారు. కానీ ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి టైటిల్ ను అనౌన్స్ చేయడంతో.. ఇక ఈ మూవీ పక్కా సంక్రాతి రిలీజ్ అనే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి లేట్ చేస్తే బాగోదు కదా. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అటు వెంకీ రావిపూడి మూవీ సంక్రాంతికి రావాలని ఎప్పుడో ఫిక్స్ అయింది. సో ఇప్పుడు దేనిని కొట్టిపారేయలేని పరిస్థితి ఏర్పడింది.
దీనితో ఇప్పుడు ఎటుతిరిగి దిల్ రాజుకు ఇది పెద్ద ఇరకాటంగా మారింది. ఎందుకంటే రెండు సినిమాలకు వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ వచ్చేలా చేయడం దిల్ రాజు బాధ్యత. దీనికోసం దిల్ రాజు పెద్ద ప్లానింగ్ ఏ చేయాల్సి ఉంటుంది. ఇక వెంకీ , చరణ్ సినిమాలతో పాటు.. బాలకృష్ణ 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తానికి చరణ్ కు పోటీగా చాలా మంది సీనియర్ హీరోలు దిగుతున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలు అంతా సోలోగానే బరిలోకి దిగారు. కానీ చరణ్ కు మాత్రం గట్టి పోటీ ఉండబోతుంది. ఈ లెక్కన శంకర్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ మీద ఉన్న ట్రోల్స్ అన్ని పోతాయి. చరణ్ మీద ఉన్న అంచనాలు నిలబడతాయి. ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.