iDreamPost
android-app
ios-app

శంకర్ మహిమ.. వరుణ్ తేజ్ కు గేమ్ ఛేంజర్ సెగలు!

  • Published Feb 20, 2024 | 5:12 PM Updated Updated Feb 20, 2024 | 5:12 PM

Varun Tej On Game Changer: వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ మెగా ప్రిన్స్ కి అనుకోని ఘటన ఎదురైంది.

Varun Tej On Game Changer: వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ మెగా ప్రిన్స్ కి అనుకోని ఘటన ఎదురైంది.

  • Published Feb 20, 2024 | 5:12 PMUpdated Feb 20, 2024 | 5:12 PM
శంకర్ మహిమ.. వరుణ్ తేజ్ కు గేమ్ ఛేంజర్ సెగలు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ హడావుడిలో ఉన్నాడు. ఫిబ్రవరి 16కి రావాల్సిన చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయిపోయింది. తాజాగా ఫైనల్ స్ట్రైక్ అంటూ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ మొత్తం ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో వరుణ్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. శంకర్ సార్ పుణ్యమా అని.. వరుణ్ తేజ్ కు కూడా గేమ్ ఛేంజర్ సెగలు తగిలాయి. అసలు ఏమైందో చూద్దాం.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉండేవి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూసి కళ్లు కాయలు కాచిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త విడుదల తేదీలు వినిపిస్తూ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ మూడేళ్లు తీసుకున్నాడు. తర్వాతి చిత్రాలు ఎంతో వేగంగా రావాలని భావించారు. ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చి ఇప్పటికే రెండేళ్లు కావొస్తోంది. కానీ, ఇప్పటికీ గేమ్ ఛేంజర్ ఊసు లేదు. అంతేకాకుండా.. కనీసం ఆ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ కూడా లేవు. శంకర్ అటు ఇండియన్ 2, ఇటు గేమ్ ఛేంజర్ అంటూ రెండు పడవల మీద కాళ్లు పెట్టేశాడు.

ఇన్నాళ్లు సెప్టెంబర్ రిలీజ్ అంటూ వార్తలు వినిపించాయి. దిల్ రాజు కూడా ఓసారి యదాలాపంగా ఆ మాట అనేశారు. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మళ్లీ డిసెంబర్ కి మారబోతోంది అంటూ ప్రచారం షురూ అయ్యింది. ఈ దెబ్బతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సహనం కూడా చచ్చిపోయింది. అందుకే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో గేమ్ ఛేంజర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది అంటే.. తన చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో మాటా మంతి కార్యక్రమాన్ని వరుణ్ తేజ్ నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో ఓ అభిమాని ఓ ప్రశ్న అడిగాడు. కాస్త రామ్ చరణ్ అన్నకి ఫోన్ చేసి గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఏమైనా చెప్పండి అంటూ అడిగాడు. అక్కడున్న వాళ్లు కూడా మా ఫీలింగ్ కూడా అదే అంటూ కామెంట్స్ చేశారు.

వాస్తవానికి ఆ ప్రశ్నకు ఆ సందర్భానికి సంబంధం లేదు. కావాలంటే వరుణ్ తేజ్ తప్పించుకోవచ్చు. కానీ, అలా చేయకుండా తన సమాధానంతో ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. “ఇవాళ ఉదయం కూడా మాట్లాడాను. ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే మీకు శుభవార్త అందుతుంది” అంటూ వరుణ్ తేజ్ సమాధానం చెప్పాడు. వరుణ్ తేజ్ సమాధానంతో ఫ్యాన్స్ కాస్త కుదుట పడ్డారు. ఇంక ఆపరేషన్ వాలెంటైన్ మూవీ విషయానికి వస్తే.. ట్రైలర్ కు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. విజువల్స్, టేకింగ్, ఆకాశంలో చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి. మరి.. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అనేది మార్చి 1న తెలుస్తుంది. మరి.. గేమ్ ఛేంజర్ పై వరుణ్ తేజ్ ఇచ్చిన అప్ డేట్ విషయంలో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet