iDreamPost
android-app
ios-app

నెలలోపే ఓటీటీలోకి ‘ఆపరేషన్ వాలంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

  • Published Mar 09, 2024 | 10:35 AM Updated Updated Mar 09, 2024 | 10:35 AM

Operation Valentine into OTT Streaming: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ హవా నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్

Operation Valentine into OTT Streaming: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ హవా నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్

  • Published Mar 09, 2024 | 10:35 AMUpdated Mar 09, 2024 | 10:35 AM
నెలలోపే ఓటీటీలోకి  ‘ఆపరేషన్ వాలంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

ఒకప్పుడు సినిమా ధియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడో టీవీల్లో కనిపించేవి. తమ అభిమాన హీరో సినిమా ధియేటర్లో చూడలేదని అభిమానులు తెగ బాధపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. వారం వారం పదుల సంఖ్యల్లో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా తమ సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఎప్పుడు..? ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు. ముకుంద మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ చాలా సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంటారని ఇండస్ట్రీలో టాక్. ఇటీవల తన సహనటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  మార్చ్ 1 న వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ థియేటర్లో సందడి చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటించింది. పుల్వామా అటాక్, భారత దేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. తెలుగులో ఈ తరహా సినిమా రావడం ఇదే మొదటి సారి అంటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అద్భుతంగా చూపించారు.

ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. హిందిలో మాత్రం మరో రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. త్వరలో ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో కలిపి 8.61 కోట్ల కలెక్షన్లు సాధించింది. తెలుగు లో 6.95 కోట్ల వసూళ్లు రాబట్టగా.. బాలీవుడ్ లో 1.66 కోట్లు వసూళ్లు చేసింది. మొదట తెలుగు వెర్షన్ రిలీజ్ చేసిన తర్వాత కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ వాలంటైన్ మూవీలో నవదీప్, రుహానీ శర్మ, శతాఫ్, సంపత్, పరేష్ పహుజ, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేత వర్మ తదితరులు నటించారు. రెసైసెన్స్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş