iDreamPost
android-app
ios-app

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా..?

  • Author ajaykrishna Published - 10:36 AM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 10:36 AM, Fri - 21 July 23
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా..?

ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు.. తమ ఫేవరేట్ హీరో హీరోయిన్స్ వివాహ బంధంలో అడుగు పెడుతున్నారంటే.. వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల మ్యారేజ్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జూన్ 9న వరుణ్ తేజ్ తమ స్వగృహంలో.. లావణ్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. అయితే.. ఎంగేజ్మెంట్ అయ్యింది కదా మరి పెళ్లి ఎప్పుడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్, లావణ్య ఇద్దరు కలిసి ఫారెన్ ట్రిప్ కి వెళ్లిపోయారు. కాఫీ డేట్ అంటూ వీరి టూర్ కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. అయితే.. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక మెగా ఫ్యాన్స్ అంతా లావణ్యని వదిన అని పిలవడం మొదలు పెట్టారు. జూన్ లో ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే ఈ క్యూట్ కపుల్ పెళ్లి కూడా ఇదే ఏడాది జరగబోతుందని అని అందరూ అనుకున్నారు. అదేవిధంగా టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది. కానీ.. సైలెంట్ గా వీరు ఫారెన్ ట్రిప్ కి వెళ్లేసరికి ఇంకా టైమ్ పడుతుందేమో అనుకున్నారు. ఎందుకంటే.. ఈరోజుల్లో ఎంగేజ్మెంట్ అయితే చాలు కదా!

ఆ తర్వాత పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అంటుంటారు. వీరు కూడా అదే బాటలో కొన్నాళ్ళు లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెడదాం అనుకున్నారేమో అంటూ ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఊహించని విధంగా వరుణ్, లావణ్యల పెళ్లి ఎంతో దూరం లేదట. వీరి పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిందంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. వచ్చే నెల అంటే ఆగష్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని సమాచారం. అందుకు సంబంధించి ఇటలీలో షాపింగ్ కూడా చేసే ఉంటారని టాక్. మరి నిజంగా ఆగష్టు 24న వరుణ్, లావణ్య పెళ్లి చేసుకుంటారేమో కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా.. వరుణ్ నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ మూవీ ఆగష్టు 25న రిలీజ్ కాబోతుంది. మరి వరుణ్, లావణ్య జంట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş