iDreamPost
android-app
ios-app

Varun Tej: లావణ్య కాకుండా ఆ హీరోయిన్ అంటే ఇష్టం – వరుణ్ తేజ్

  • Published Feb 07, 2024 | 12:49 PM Updated Updated Feb 07, 2024 | 12:49 PM

ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అవుతున్న సినీ జంట హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి . అయితే తాజాగా ఈ హీరో ఒక ఇంటర్వ్యూ లో తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చెప్పేశాడు.

ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అవుతున్న సినీ జంట హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి . అయితే తాజాగా ఈ హీరో ఒక ఇంటర్వ్యూ లో తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చెప్పేశాడు.

  • Published Feb 07, 2024 | 12:49 PMUpdated Feb 07, 2024 | 12:49 PM
Varun Tej:  లావణ్య కాకుండా ఆ హీరోయిన్ అంటే ఇష్టం – వరుణ్ తేజ్

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని.. మెగా కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక అప్పటినుంచి వారి కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతూ వస్తుంది. వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికపుడు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ వస్తున్నాయి. అలాగే పెళ్లి తర్వాత వీరిద్దరూ ఎవరి సినిమాలతో వారు చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరికి సంబదించిన వ్యక్తిగత విషయాలు కూడా.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గా మారుతున్నాయి . ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పేశాడు. దీనితో ప్రస్తుతం ఈ హీరో మాటలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే, ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో.. హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఒక చిత్రంలో నటించాడు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా “ఆపరేషన్ వాలెంటైన్”. కొన్ని విషయాల కారణంగా ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు మార్చి 1న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనితో చిత్ర బృందం “ఆపరేషన్ వాలంటైన్” మూవీ ప్రమేషన్లను వేగవంతం చేసింది. ఇక తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ వేడుకను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడ కాలేజీ విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు.. సరదాగా సమాధానాలు ఇచ్చారు వరుణ్ తేజ్. వారిలో ఒకరు మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అని అడుగగా.. వరుణ్ ఇలా సమాధానం ఇచ్చారు. “నా ఫేవరేట్ హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నాను. మంచి కథలు వస్తే.. నేనూ లావణ్య కలిసి చేస్తాం. మా ఇద్దరిలో నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. లావణ్య కాకుండా నాకు సాయి పల్లవి అంటే కూడా అభిమానం” అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్.

ఇక “ఆపరేషన్ వాలెంటైన్” సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పైలట్ గా కనిపించనున్నారు. కథ విషయానికొస్తే.. . దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను.. ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించినట్లు.. తెలియజేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని ‘గగనాల తేలేను నీ ప్రేమలోన’.. అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం కాకుండా వరుణ్ మట్కా అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులు జరుపుకుంటోంది. మరి, వరుణ్ తేజ్ తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom