iDreamPost
android-app
ios-app

బడా బ్యానర్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య..!

  • Published Dec 24, 2023 | 4:50 PM Updated Updated Dec 24, 2023 | 4:50 PM

ఈ ఏడాది కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిపోయింది బేబీ చిత్రం. ఈ మూవీలో వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయిపోయారు కుర్రకారు. ఈ అమ్మాయి నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడే మరో బడా నిర్మాణ సంస్థలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాది కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిపోయింది బేబీ చిత్రం. ఈ మూవీలో వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయిపోయారు కుర్రకారు. ఈ అమ్మాయి నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడే మరో బడా నిర్మాణ సంస్థలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

  • Published Dec 24, 2023 | 4:50 PMUpdated Dec 24, 2023 | 4:50 PM
బడా బ్యానర్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య..!

యూట్యూబర్లు ఇప్పుడు హీరోయిన్లుగా మారుతున్నారు. వాటికి ఆద్యం పోసింది వైష్ణవి చైతన్య. వెబ్ సిరీస్‌లు చేస్తూ యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్యుయెన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి.. వెండితెరపైకి అడుగుపెట్టింది. తొలుత చిన్న చిన్న పాత్రలతోనే మెప్పించింది. వరుడు కావలెను, టక్ జగదీష్ వంటి చిత్రాల్లో నటించి.. హీరోయిన్‌గా ప్రమోట్ అయ్యింది. బేబి అంటూ ఈ ఏడాది పలకరించింది.. తన యాక్టింగ్‌తో కుర్రకారు గుండెల్లో గునపాలు గుచ్చేసింది. కల్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీని సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఒకరిని ప్రేమించి, మరో అబ్బాయితో రొమాన్స్ చేసి.. మరో వ్యక్తిని పెళ్లాడుతుంది. ఈ మూవీతో ఆమెకు వచ్చిన విమర్శలు ఎన్నో. అయినప్పటికీ ప్రశంసలు అందుకుంది.

ఇలాంటి చిత్రాల్లో నటించాలంటే హీరోయిన్లకు కాస్త గట్స్ ఉండాలి. సినిమా విడుదలయ్యాక నెగిటివిటీ వస్తుందని తెలిసినా కూడా నటించింది. మూవీ రిలీజ్ అయ్యాక.. విమర్శలే వచ్చినప్పటికీ.. అల్లు అర్జున్ లాంటి వ్యక్తులు ఆమె నటన పట్ల ప్రశంసలు వ్యక్తం చేస్తుండటంతో.. కాస్త నెగిటివిటీ తగ్గింది. అయితే ఇదే సమయంలో అవకాశాలు వస్తాయని అనుకుంటే.. మరో మూవీ ఎనౌన్స్ చేయలేదు. ఆమెకు అవకాశాలు రావట్లేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ బేబి కాంబోలో సినిమా చేస్తోంది. ఆనంద్ దేవరకొండతో మరోసారి జతకడుతోంది. సాయి రాజేష్ ఈ మూవీకి కథ అందిస్తుండగా.. నంబూరు రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ స్టార్ అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.

ఇప్పుడు వైష్ణవి మరో మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బడా నిర్మాణ సంస్థలో తీయబోతున్న ఓ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న పిక్చర్‌లో వైష్ణవికి ఆఫర్ వచ్చిందట. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ రెడ్డితో ఓ సినిమాను తీయబోతున్నాట. ఆ మూవీ కోసం బేబి నటిని సెలెక్ట్ చేసుకున్నారని వినికిడి. ఈ మూవీకి లవ్ మీ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అరుణ్ భీమవరపు అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సెల్ఫిష్ అనే మూవీలో కనిపించబోతున్నాడు. ఇటీవలే అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు తొలిసారిగా.. అతడితో జతకట్టబోతుంది వైష్ణవి. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరీ ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet