iDreamPost
android-app
ios-app

చిరు బ‌ర్త్ డే.. వైజయంతి నుండి థియేటర్స్ దద్దరిల్లిపోయే గిఫ్ట్ రెడీ !

  • Published Jul 24, 2024 | 7:16 PM Updated Updated Jul 24, 2024 | 7:16 PM

ఇప్పుడున్న యంగ్ హీరోలను ఎవరును అడిగినా కానీ.. వారందరికీ సినిమాలలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఒకే ఒక్కరని చెప్తారు. అతను మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో చిరు బర్త్ డే సంధర్బంగా వైజయంతి మూవీస్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ రాబోతుంది. అదేంటో చూసేద్దాం.

ఇప్పుడున్న యంగ్ హీరోలను ఎవరును అడిగినా కానీ.. వారందరికీ సినిమాలలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఒకే ఒక్కరని చెప్తారు. అతను మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో చిరు బర్త్ డే సంధర్బంగా వైజయంతి మూవీస్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ రాబోతుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Jul 24, 2024 | 7:16 PMUpdated Jul 24, 2024 | 7:16 PM
చిరు బ‌ర్త్ డే.. వైజయంతి నుండి థియేటర్స్ దద్దరిల్లిపోయే గిఫ్ట్ రెడీ !

చిరంజీవి.. ఈ పేరు వింటేనే సగం మందికి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇండస్ట్రీ లో ఇప్పటివరకు చిరు గ్రెస్ ను కానీ , స్టైల్ ను కానీ బీట్ చేసే వాళ్ళు రాలేదని చెప్పి తీరాలి. స్వతహాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అంచలంచెలుగా ఎదిగి ఈరోజు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలను ఎవరిని అడిగినా కానీ వారందరికీ సినిమాలలోకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి అనే చెప్తారు. ఇప్పటికి కూడా ఎంతో మంది హీరోలకు కంపిటిషన్ గా నిలుస్తున్నారు చిరు. ఈ క్రమంలో ఆగష్టు 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సంధర్బంగా వైజయంతి మూవీస్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ రాబోతుంది. అదేంటో చూసేద్దాం.

వైజయంతి నిర్మాణంలో బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో సరిగ్గా 22 ఏళ్ళ క్రితం.. ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసే ఓ సినిమా రిలీజ్ అయింది. అదే మెగాస్టార్ చిరు నటించిన “ఇంద్ర” సినిమా. అప్పట్లో థియేటర్స్ లో ఈ సినిమా సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. ఇప్పటికి కూడా ఈ సినిమాకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. రెగ్యులర్ గా అడపా దడపా టీవీలలో వస్తూనే ఉన్నా కానీ.. సినిమా వచ్చిన ప్రతి సారి ఇదే మొదటిసారి అన్నట్లు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. కేవలం అప్పటి జనరేషన్ కే కాకుండా ఇప్పటి జనరేషన్ వారికి కూడా ఈ సినిమా ప్రత్యేకమే. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో రిరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంద్ర సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళైన సంధర్బంగా.. వైజ‌యంతీ మూవీస్ ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేయనుంది. అంటే ఆగష్టు 22 వ తేదీన మరొక్కసారి థియేటర్స్ అన్నీ కూడా వింటేజ్ చిరు గ్రెస్ తో కళకళలాడనున్నాయి. చిరు బర్త్ డే కు థియేటర్స్ దద్దరిల్లిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ రీరిలీజ్ ల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతున్నా కానీ.. వైజ‌యంతీ మూవీస్ మాత్రం ఇప్పటివరకు తమ సినిమాలను ఈ రీరిలీజ్ ల రేస్ లోకి తీసుకుని రాలేదు. కానీ ఇప్పుడు ఇంద్ర మూవీ రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు అవ్వడం , వైజ‌యంతీ మూవీస్ కు గోల్డెన్ జూబ్లీ అవ్వడంతో తొలిసారి.. మెగాస్టార్ ఫ్యాన్స్ కు మెగా గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఇంద్ర సినిమా విషయానికొస్తే.. ఆ సినిమాలోని డైలాగ్స్ , పాటలు అందరికి కఠస్తం అయిపోయాయి. ఇక ఈ సినిమాలోని వీణ స్టెప్ అయితే .. హుక్ స్టెప్స్ లో ఫస్ట్ ప్లేస్ దీనికే ఉంటుంది. ఇలా ఈ సినిమాలోని ప్రతి ఒక్కటి అందరికి ప్రత్యేకమే. ఇలాంటి సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మంచి సౌండ్ సిస్టం తో మరొక్కసారి థియేటర్స్ లో చూస్తే.. ఇక ఈ జన్మకు ఇది చాలు అనుకుంటూ ఉంటారు చిరు అభిమానులు. మరి చిరు బర్త్ డే గిఫ్ట్ అయినా ఇంద్ర మూవీ రీరిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss