iDreamPost
android-app
ios-app

విమానంలో ప్రముఖ నటిని వేధించిన తాగుబోతులు!

  • Published Jul 22, 2023 | 9:03 AM Updated Updated Jul 22, 2023 | 9:05 AM
  • Published Jul 22, 2023 | 9:03 AMUpdated Jul 22, 2023 | 9:05 AM
విమానంలో ప్రముఖ నటిని వేధించిన తాగుబోతులు!

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావెద్‌ తన విభిన్నమైన డ్రెస్సింగ్‌ స్టైల్స్‌తో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమె తన డెస్సింగ్‌ స్టైల్స్‌ కారణంగా జనం నుంచి ట్రోలింగ్స్‌ను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఉర్ఫీ ఎక్కడైనా బయట కనబడితే ఆమెపై కామెంట్లు చేసే వారు లేకపోలేరు. అంతలా ఆమెపై కొంతమంది జనాలకు కోపం ఉంది. ఎన్ని విమర్శలు, ట్రోలింగ్స్‌ ఎదురైనా ఉర్ఫీ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఆమె తను చేయాలనుకున్న దాన్ని చేస్తూ పోతోంది.

ఈ నేపథ్యంలోనే అన్ని చోట్లా ఆమెకు అవమానాలు ఎదురవుతున్నాయి. కేవలం రోడ్డు మీదే కాదు.. విమానంలోనూ ఆమెకు వేధింపులు తప్పటం లేదు. తాజాగా, విమానంలో ప్రయాణిస్తున్న ఆమెను కొంతమంది తాగుబోతులు దారుణంగా తిట్టారు. విమానంలోనే ఆమెపై వేధింపులకు దిగారు. ఈ విషయాన్ని స్వయంగా ఉర్ఫీనే చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టింది. ఆ స్టోరీలో.. ‘‘ నిన్న నేను ముంబై నుంచి గోవాకు ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు నన్ను వేధింపులకు గురి చేశారు.

Urfi javed suffered in airplane with drunk man

నాతో పచ్చి బూతులు మాట్లాడారు. దీంతో నేను ఓ వ్యక్తిని నిలదీశాను. తన ఫ్రెండ్స్‌ అందరూ తాగి ఉన్నారని అతడు చెప్పాడు. తాగి ఉన్నంత మాత్రాన.. ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తే క్షమించరు. పబ్లిక్‌ ఫిగరే కావచ్చు.. కానీ, పబ్లిక్‌ ప్రాపర్టీ మాత్రం కాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీకి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, నటి ఉర్ఫీ జావెద్‌పై విమానంలో వేధింపులకు పాల్పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş