iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు పండగే.. మార్చిలో ఎన్ని సినిమాలు విడుదలంటే

  • Published Mar 04, 2024 | 12:05 PM Updated Updated Mar 04, 2024 | 12:05 PM

ఈనెలలో మూవీ లవర్స్ ను అలరించడానికి థియేటర్లలో చాలా సినిమాలు వరుసగా ఉన్నాయి. ఆ సినిమాలేవంటే..

ఈనెలలో మూవీ లవర్స్ ను అలరించడానికి థియేటర్లలో చాలా సినిమాలు వరుసగా ఉన్నాయి. ఆ సినిమాలేవంటే..

  • Published Mar 04, 2024 | 12:05 PMUpdated Mar 04, 2024 | 12:05 PM
మూవీ లవర్స్‌కు పండగే.. మార్చిలో ఎన్ని సినిమాలు విడుదలంటే

ఇప్పటికే సంక్రాతి తర్వాత ఇండస్ట్రీలో సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. అసలే గత ఫిబ్రవరి నెల అన్ సీజన్ కావడంతో.. ప్రేక్షకులను అలరించడానికి చిన్న తరహా సినిమాలు తప్ప, చెప్పుకొదగ్గ సినిమాలేవి లేవు.దీంతో ఒకపక్క ఓటీటీలో వివధ రకాల జోన్ వెబ్ సిరీస్ అనేవి ప్రేక్షకులను ఆకర్షించడంతో అందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్ పైనే ఆసక్తి కనబరచుతున్నారు.ఈ నేపథ్యంలోనే మార్చి నెల ప్రారంభం కావడంతో.. ఈనెల ప్రేక్షకులను అలరించడానికి మంచి మంచి చిత్రాలు అనేవి థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.ప్రస్తుతం థియేటర్లలో మెగా ఫ్రిన్స్ వరుణ్ తేజ్ ఆరేషన్ వాలెంటైన్ ఇప్పటికే సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పుడు మరిన్ని సినిమాలు ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్మెంట్ చేయడానికి వరుస క్యూ కట్టాయి.

టాలీవుడ్ సినీ పరిశ్రమలో.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలయింది. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించగా.. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక దీని తర్వాత.. శివకందుకూరి, రాశీసింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమాను పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా కూడా మార్చి 1 నుంచి థియేటర్లలో అలరిస్తుంది. ఇక వీటి తర్వాత వరుసగా.. గోపిచంద , విశ్వకసేను, శ్రీ విష్ణు, సిద్ధు జొన్నలగడ్డ వంటి తదితర హీరోలా సినిమాలు థియేటర్లలో విడుదలకు రెడీగా ఉన్నాయి. అందులో ఏ సినిమాలు ఏ ఏ తేదీలకు విడుదలవుతున్నాయో చూద్దాం.

విశ్వక్ సేన్ (గామి)మార్చి-08

గోపిచంద్ (భీమా) మార్చి-08

మాలయాళ సినిమా (ప్రేమలు) మార్చి-08

(రంగ)మార్చి-09

(రజకర్) మార్చి-15

(షరతులు వర్తిస్తాయి) మార్చి- 15

(వెయ్ దరువెయ్) మార్చి _15

(మంజుమెల్ బాయ్స్) మార్చి- 15

(కుంగ్ ఫు పాండా) 4 మార్చి- 15

(ఆ ఒక్కటి అడగకు) మార్చి- 22

శ్రీవిష్ణు- (ఓం బీమ్ బుష్) మార్చి- 22

(కలియుగ పట్నం) మార్చి- 22

సిద్ధు- (జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్) మార్చ- 22

(గాడ్జిల్లా ఎక్స్ కాంగ్) మార్చి- 29

ఇక, త్వరలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న  ఈ 14 సినిమాలన్ని ప్రేక్షకుల అంచానాలకు మించేలా, మెప్పించేలా ఉంటాయా అనేది విడుదలైతే కానీ చెప్పలేం. మరి, త్వరలో థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాల్లో మీకు ఆసకరంగా అనిపించే సినిమా ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.