Krishna Kowshik
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ ఎవరు అంటే ఠక్కున చెప్పేస్తారు జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ అని. మరీ ఈ ఫోటో ఎప్పటిదో, ఏ సందర్భంలోనిదో తెలుసా..? ఈ ఫోటో వెనుక చాలా కథ ఉంది. ఈ జనరేషన్‌కి తెలియని సంఘటన అది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ ఎవరు అంటే ఠక్కున చెప్పేస్తారు జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ అని. మరీ ఈ ఫోటో ఎప్పటిదో, ఏ సందర్భంలోనిదో తెలుసా..? ఈ ఫోటో వెనుక చాలా కథ ఉంది. ఈ జనరేషన్‌కి తెలియని సంఘటన అది.
Krishna Kowshik
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పడు అమ్మాయిల కలల రాకుమారుడు, దివంగత నటుడు ఉదయ్ కిరణ్, మరొకరు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇద్దరు చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాక్సాఫీసుకు కలెక్షన్ల వర్షం రుచి చూపించారు. ఏడాది గ్యాప్‌లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ స్టార్స్ తారక్ అండ్ ఉదయ్. 2000 సంవత్సరంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో ఉదయ్ కిరణ్. ‘చిత్రం’ మూవీతో హీరోగా తెరకు పరిచయమయ్యాడు. ఇక నందమూరి వారసుడైనా కూడా.. తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశంతో ‘నిన్ను చూడాలని’ మూవీతో హీరోగా మారాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇద్దరు కలిసిన ఈ ఫోటో ఏ సమయంలోనిదో తెలుసా..? ఫోటో వెనుక చాలా కథ ఉంది. ఈ జనరేషన్‌కి తెలియని సంఘటన అది.
ఇప్పుడంటే సినిమా ట్రెండ్ మారింది. ట్రైలర్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ సినిమా విడుదలకు ముందు ఫంక్షన్స్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ మాత్రమే ఉండేది. అలాగే ఒక హీరో సినిమాకు మరో హీరో రావడం ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటి నుండో కొనసాగుతుంది. ఇదిగో తారక్, ఉదయ్‌లు కలిసింది కూడా ఓ స్టార్ హీరో సినీ ఫంక్షన్‌లోనే. ఇంతకు అది ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అంటే.. మాస్ మహారాజ్ రవితేజ, కళ్యాణి హీరో హీరోయిన్లుగా నటించిన దొంగోడు మూవీ అప్పటిది. రవితేజ కోసం ఈ ఇద్దరు స్టార్స్ కదిలి వచ్చారు. ఇది 2003లోని సంగతి. అప్పుడప్పుడే రవితేజ వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. ఆ సమయంలో వచ్చిందే ఈ మూవీ. అప్పటికే రవితేజ, కళ్యాణి.. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఔను వాళిద్దరూ ఇష్టపడ్డారు అనే మూవీలో నటించారు. ఆ సినిమా హిట్ కొట్టడంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించింది.
అలా దొంగోడు మూవీ తెరకెక్కింది. దీనికి భీమిలినేని శ్రీనివాస రావు దర్శకుడు. ఆ ఆడియో ఫంక్సన్‌కు వచ్చారు ఈ స్టార్స్ ఇద్దరు. ఇద్దరు ఒకే కలర్ షర్టులో వచ్చి ఆడియో ఫంక్షన్‌కు మరింత కలర్ తెచ్చారు. అప్పటికే ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ హిట్లతో డ్రీమ్ బాయ్‌గా మారాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం వంటి చిత్రాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో జోరు మీదున్నాడు. ఇవే కాకుండా అల్లరి రాముడు, సుబ్బు, నాగ వంటి చిత్రాలు చేశాడు. ఇక ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటు వల్ల మెల్లిగా అవకాశాలు తగ్గిపోయాయి. చివరకు 2014లో 33 ఏళ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణాన్ని త ట్టుకోలేకపోయాడు డై హార్ట్ ఫ్యాన్స్. ఇప్పటికి అతడ్ని తలచుకుంటే.. కంటిలో చిన్న చెమ్మ రావాల్సిందే.