iDreamPost
android-app
ios-app

Shiva Jyothi: తీన్మార్‌ సావిత్రిపై నెటిజనుల ఆగ్రహం.. మీకు రూల్స్‌ వర్తించవా అంటూ ఫైర్‌

  • Published Jun 21, 2024 | 11:30 AMUpdated Jun 21, 2024 | 11:30 AM

టాలీవుడ్‌ యాంకర్‌ శివజ్యోతి చేసిన పనులపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.. మీకు రూల్స్‌ వర్తించవా అంటూ ఫైర్‌ అవుతున్నారు. ఆ వివరాలు..

టాలీవుడ్‌ యాంకర్‌ శివజ్యోతి చేసిన పనులపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.. మీకు రూల్స్‌ వర్తించవా అంటూ ఫైర్‌ అవుతున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 21, 2024 | 11:30 AMUpdated Jun 21, 2024 | 11:30 AM
Shiva Jyothi: తీన్మార్‌ సావిత్రిపై నెటిజనుల ఆగ్రహం.. మీకు రూల్స్‌ వర్తించవా అంటూ ఫైర్‌

సామాన్యులు ఏం చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సెలబ్రిటీలు అలా ఉంటే కుదరదు. ఎందుకంటే.. వారు చేసే పనులు సమాజం మీద ఎంతో ప్రభావం చూపుతాయి. ఎందరో వారిని ఫాలో అవుతుంటారు. ఇక సెలబ్రిటీలు చేసే పనులు నలుగురికి ఆదర్శంగా లేకున్నా పర్లేదు.. కానీ చెడగొట్టేవిధంగా ఉండకూడదు. ఎందుకంటే మన సమాజంలో సెలబ్రిటీలు ఏం పనులు చేస్తే.. చాలా మంది జనాలు వారిని అనుసరిస్తారు. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది సెలబ్రిటీలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే పనులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో తీన్మార్‌ యాంకర్‌ సావిత్రి అలియాస్‌ శివ జ్యోతి చేసిన ఓ పనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు రూల్స్‌ వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే..

నేటి కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. సోషల్‌ మీడియా పిచ్చి. అందునా రీల్స్‌ పిచ్చి ముదిరిపోతుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం, వ్యూస్‌ కోసం రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ.. నడి రోడ్డు, బస్సులు, మెట్రో, రైళ్లు, విమానం, ఇలా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి వేషాలు వేస్తూ.. వాటిని రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు.

ఇక గత రెండు, మూడు రోజులుగా రీల్స్‌ పిచ్చితో ప్రాణాలు తీసుకున్న వారి గురించి చదివాం. 300 అడుగుల ఎత్తు నుంచి కారు కిందపడటం, ఓ యువతి.. యువకుడి చేయి పట్టుకుని.. బిల్డింగ్‌ మీద నుంచి వేలాడటం, మరోక వ్యక్తి ఉరి వేసుకుంటానని ప్రాంక్‌ చేద్దామని భావించి.. నిజంగానే మృత్యువాత పడటం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇవన్ని రీల్స్‌ పిచ్చి వల్ల చోటు చేసుకున్న దారుణాలు. ఈ క్రమంలో యాంకర్‌ సావిత్రి చేసిన పనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రీల్స్‌ చేస్తున్నారు. ఈ జాబితాలో యాంకర్‌ సావిత్రి అలియాస్‌ శివజ్యోతి కూడా చేరింది. యాంకర్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి.. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఆమెకు యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. వీడియోలు చేస్తూ.. ఇన్‌స్టాలో రీల్స్‌, ఫొటోషూట్‌లు చేస్తూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా శివజ్యోతి హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై రీల్స్‌ చేస్తూ.. సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే దీన్ని చూసిన వారు శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోని చూసిన నెటిజనులు.. శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద వాహనాలు ఎంత వేగంగా వెళ్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ స్పీడ్‌ లిమిట్‌కు సంబంధించి ఎన్నో నిబంధనలు అమల్లో ఉంటాయి. కానీ రీల్స్‌ పిచ్చి ఉన్న వారు.. ఈ వాటిని తుంగలో తొక్కి.. వారికి నచ్చినట్లుగా ఓఆర్‌ఆర్‌ మీద పిచ్చి వేషాలు వేస్తున్నారు. రీల్స్‌ షూట్‌ చేస్తూ.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన మీకు రూల్స్‌ వర్తించవా.. పోలీసులు మీపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాక నిషేధిత ప్రాంతాల్లో రీల్స్‌ చేసేవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ఇలాంటి ప్రాంతాల్లో రీల్స్‌ చేయడం కరెక్టేనా.. ఇలాంటి వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. పోలీసులు ఇలానే వదిలేస్తే.. ఓఆర్‌ఆర్‌ఆర్‌ను రీల్స్‌ షూట్‌ చేయడానికి అడ్డాగా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. మరి దీనిపై పోలీసులు, శివజ్యోతి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి