Swetha
ఎట్టకేలకు మరోసారి వెంకీ , త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది. నువ్వు నాకు నచ్చావ్ , మల్లేశ్వరి సినిమాలు ఇప్పటికి టెలివిజన్స్ ల్లో మంచి టిఆర్పి ని అందుకుంటూనే ఉన్నాయి. తెలుగు సినిమా హిస్టరీలో మంచి ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ సినిమాలుగా నిలిచిపోయాయి.
ఎట్టకేలకు మరోసారి వెంకీ , త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది. నువ్వు నాకు నచ్చావ్ , మల్లేశ్వరి సినిమాలు ఇప్పటికి టెలివిజన్స్ ల్లో మంచి టిఆర్పి ని అందుకుంటూనే ఉన్నాయి. తెలుగు సినిమా హిస్టరీలో మంచి ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ సినిమాలుగా నిలిచిపోయాయి.
Swetha
ఎట్టకేలకు మరోసారి వెంకీ , త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది. నువ్వు నాకు నచ్చావ్ , మల్లేశ్వరి సినిమాలు ఇప్పటికి టెలివిజన్స్ ల్లో మంచి టిఆర్పి ని అందుకుంటూనే ఉన్నాయి. తెలుగు సినిమా హిస్టరీలో మంచి ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ సినిమాలుగా నిలిచిపోయాయి. వెంకటేష్ ఫ్యామిలి ఆడియన్స్ మెచ్చే హీరో. మధ్యలో ఓసారి త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయాలనీ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. తర్వాత ఎవరి సినిమాలలో వారు బిజీ బిజీ అయిపోయారు . ఇప్పటిలో ఉండకపోవచ్చని దాదాపు అంతా ఓ నిర్ణయానికి వచ్చేసారు.
కానీ ఊహించని విధంగా ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో సినిమాను అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మూవీ సెట్స్ మీదకు వెళ్లిందట. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాత నాగవంశీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ సెట్స్‌లోకి అడుగు పెడుతున్న విషయాన్ని అనౌన్స్ చేశారు. సో త్వరలోనే తెరమీద ఓ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. వీలైనంత త్వరగా షూట్ ఫినిష్ చేసి.. 2026 సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా.. కుటుంబ కథా చిత్రంగా రూపొందించనున్నట్లు టాక్.
అయితే ఈ సినిమా టైటిల్ ను ‘అబ్బాయిగారు 60 ప్లస్’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో వెంకీ నటించిన అబ్బాయిగారు సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. అందుకనే ఇప్పుడు అదే టైటిల్ ని రిపీట్ చేయబోతున్నారట. మల్లేశ్వరి సినిమాలో పెళ్లికాని ప్రసాదు టైపు క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ ఎలాంటి క్యారెక్టర్ కైనా ఈజీగా ఫిట్ అయిపోతారు. కాబట్టి అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిని అప్డేట్స్ ను ఇవ్వనున్నారట. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.