మాటల మాంత్రికుడి నుంచి మల్టీ స్టారర్ !!

Trivikram : త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే సినిమా తీస్తారని అంతా అనుకున్నారు. పైగా ఇప్పటివరకు లేని విధంగా త్రివిక్రమ్ బన్నీతో కలిసి పాన్ ఇండియా మూవీ తీస్తారని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈలోపు త్రివిక్రమ్ ఓ మంచి సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే సినిమా తీస్తారని అంతా అనుకున్నారు. పైగా ఇప్పటివరకు లేని విధంగా త్రివిక్రమ్ బన్నీతో కలిసి పాన్ ఇండియా మూవీ తీస్తారని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇక్కడితో త్రివిక్రమ్ ఆగిపోతాడని కాదు కానీ కాస్త ఆలస్యం అవుతుందనైతే చెప్పొచ్చు. అట్లీ సినిమా కంప్లీట్ అయ్యాక బన్నీ కచ్చితంగా త్రివిక్రమ్ తో కలిసి సినిమా తీసే అవకాశం ఉంది.

అయితే ఈలోపు త్రివిక్రమ్ ఓ మంచి సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. అదే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి లాంటి సినిమాలైతే అందరికి ఆల్ టైం ఫేవరేట్ సినిమాలే. సో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు ఘాటుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు వెంకటేష్ కూడా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మరే ప్రాజెక్ట్స్ చేయడం లేదు కాబట్టి.. త్రివిక్రమ్ కు ఎస్ చెప్పే అవకాశం లేకపోలేదు. పైగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు సుకుమార్ మూవీ కూడా చేయాల్సి ఉంది. సో మరి మధ్యలో చరణ్ త్రివిక్రమ్ తో కలిసి నటిస్తాడా అనేది ప్రశ్న.

ఈ మల్టీస్టారర్ మ్యాటర్ లో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ.. వెంకీ- త్రివిక్రమ్ కాంబినేషన్ అనేసరికి ప్రేక్షకులలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. మరి ఇదైనా జరుగుతుందా లేదా అనేది సందేహమే. ఒకవేళ వర్క్ అవుట్ అయితే మాత్రం త్రివిక్రమ్- వెంకీ నుంచి మరో క్లాసిక్ మూవీ వచ్చినట్లే. ఇక త్వరలో వీటి గురించి ఏమైనా అఫీషియల్ అనౌన్సుమెంట్స్ వస్తాయేమో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments