Tirupathi Rao
AV Raja- Trisha Issue: హీరోయిన్ త్రిషపై కొందరు చౌకబారు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఏవీ రాజా వ్యాఖ్యలపై త్రిష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
AV Raja- Trisha Issue: హీరోయిన్ త్రిషపై కొందరు చౌకబారు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఏవీ రాజా వ్యాఖ్యలపై త్రిష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Tirupathi Rao
స్టార్ హీరోయిన్ త్రిష మీద చౌకబారు వ్యాఖ్యలు ఆగడం లేదు. ఇటీవల నటుడు మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా ఒక రాజకీయ నేత అలాంటి చీప్ కామెంట్స్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తమిళనాట రాజకీయాల నేపథ్యంలో అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష గురించి చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒక్క తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అలాగే ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా ఘాటుగానే స్పందించింది.
ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు.. “తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయంగా ఆధిపత్య పోరు జరిగిన విషయం తెలిసిందే. శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు ఎవరికి వాళ్లు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినంత పని చేశారు. ఎమ్మెల్యేలను రిసార్టుల్లో పెట్టి ప్రలోభాలకు గురి చేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఎవరికి వాళ్లు క్యాంపులు ఏర్పాటు చేశారు. చెన్నైలోని కూవథూర్ సముద్రతీరంలోని ఓ రిసార్టులో శశికళ వర్గం వాళ్లు ఎమ్మెల్యేలను బంధించినంత పని చేశారు. అంతేకాకుండా వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని చేయని ప్రయత్నం లేదు. రిసార్టుకు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలకు అడిగినంత డబ్బు, కిలోల కొద్దీ బంగారం అందజేశారు. అయితే ఒక నేత మాత్రం తనకు అవేమీ వద్దని చెప్పుకొచ్చాడు. తనకు మాత్రం త్రిష కావాలని కోరాడు. అప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తన ఇన్ఫ్లుయెన్స్ వాడి త్రిషను రిసార్టుకు రప్పించాడు. అందుకు రూ.25 లక్షలు ఇచ్చాడు. అంతేకాకుండా అక్కడ తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇంకా కొంత మంది హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు కూడా వచ్చారు” అంటూ ఏవీ రాజు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాం. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను మళ్లీ మళ్లీ చూడటం ఎంతో అసహ్యంగా ఉంది. కొందరు వ్యక్తులు అటెన్షన్ కోసం ఎంతకైనా దిగజారతారు. ఈ విషయానికి సంబంధించి ఏమైనా చెప్పాలన్నా, స్పందించాలన్నా నా లీగల్ టీమ్ రియాక్ట్ అవుతుంది అంటూ త్రిష వార్నింగ్ ఇచ్చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తాను స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాను అంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏవీ రాజు వ్యాఖ్యలపై నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత చీప్ గా అసలు ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకుడిపై కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.