iDreamPost
android-app
ios-app

లవర్స్ డే సందర్భంగా రీ-రిలీజ్ అవుతున్న 9 బెస్ట్ లవ్ స్టోరీ సినిమాలివే!

  • Published Feb 10, 2024 | 12:41 PM Updated Updated Feb 13, 2024 | 3:58 PM

ఈ ఏడాది వాలెంటైన్స్ డే సినీ ప్రేమికులకు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 14న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ ఏడాది వాలెంటైన్స్ డే సినీ ప్రేమికులకు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 14న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Published Feb 10, 2024 | 12:41 PMUpdated Feb 13, 2024 | 3:58 PM
లవర్స్ డే సందర్భంగా రీ-రిలీజ్ అవుతున్న 9 బెస్ట్ లవ్ స్టోరీ సినిమాలివే!

ఫిబ్రవరి 14న అంటే అందరికి గుర్తొచ్చేది ప్రేమికులే. అయితే ఈ ఏడాది మాత్రం ప్రేమికుల దినోత్సవం కేవలం ప్రేమికుల వరకే పరిమితం కాకుండా .. సినీ ప్రేమికులకు కూడా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఈ సారి ఫిబ్రవరి 14న ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రీరిలీజ్ లను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . అయితే, సాధారణంగా ప్రేమికుల దినోత్సవం అంటే .. చాలా మందికి ఉండే ప్లాన్స్ లో మూవీ కూడా ఒకటి. అందులోను లవ్ కంటెంట్ ఎక్కువ ఉండే సినిమాలను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉండి ఉంటారు. అలాంటివారందరికి ఈ రీరిలీజ్ సినిమాలు మంచి ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పి తీరాలి. మరి, ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల కాబోయే సినిమాలేంటో చూసేద్దాం.

ప్రస్తుతం రీరిలీజ్ సినిమాలకు వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. రీరిలీజ్ సమయాల్లో అటు థియేటర్లలో , ఇటు సోషల్ మీడియాలో అభిమానులు చేస్తున్న హడావిడి చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే ఆల్రెడీ గత ఏడాది రీరిలీజ్ చేసిన సినిమాలను కూడా .. ఈ ఏడాది మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ హీరో సూర్య ద్విపాత్రాభినయం చేసిన “సూర్య s/o కృష్ణన్” సినిమాను ఫిబ్రవరి 14న రీరిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు ఆ సినిమాతో పాటు మరో 8సినిమాలు కూడా రీరిలీజ్ కానున్నాయి. అవి ఇలా ఉన్నాయి.

అప్పట్లో హీరో సిద్ధార్ధ్ సినిమాలంటే అందరికి గుర్తొచ్చేది ప్రేమ కథలే. వాటిలో ముఖ్యంగా 2009లో వచ్చిన “ఓయ్” సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలో శ్యామిలి హీరోయిన్ గా నటించారు. ఇప్పటికి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు సుమారు 15 ఏళ్ళ తర్వాత రీమాస్టర్ వెర్షన్ తో .. వాలెంటైన్స్ డే సందర్బంగా “ఓయ్” సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత లవర్ బాయ్ గా మరో మంచి హిట్ అందుకున్న సిద్ధార్ద్ చిత్రం.. “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని కూడా అదే రోజున థియేటర్ లో రీరిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రేమ కథ చిత్రాలలో .. అందరికి ముందు గుర్తొచ్చే సినిమా “తొలి ప్రేమ”. 1998లో ఈ సినిమా ఎంతో మంది కుర్రకారుని ప్రేమలో పడేలా చేసింది . ఓ రకంగా పవన్ కళ్యాణ్ కు ఈ చిత్రం మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టింది. ఆల్రెడీ గత ఏడాది థియేటర్ లో ఏ మూవీ సందడి చేసినా కూడా.. ప్రేమికులకు మంచి జ్ఞాపకాలను అందించేందుకు మళ్ళీ ఈ సినిమాను ఫిబ్రవరి 14న రీరిలీజ్ చేయనున్నారు.

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించిన .. క్లాసికల్ హిట్ “సీతారామం”. ఈ సినిమాకు , ప్రత్యేకించి ఈ సినిమాలోని పాటలకు ఎంతో మంది ఉన్నారు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు శర్వానంద్ నటించిన “జర్నీ”. తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేమకథా చిత్రాలను కూడా విడుదల చేయనున్నారు . “దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే”. “దిల్ తో పాగల్ హై’, మోహబ్బతే వంటి చిత్రాలు రీరిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కరోజులో ఇన్ని చిత్రాలు రీరిలీజ్ ను ప్రకటించడంతో .. మూవీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆరోజున థియేటర్ల్స్ లో ఏ రేంజ్ లో సందడి ఉంటుందో .. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి, ఈ సినిమాల రీరిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.