iDreamPost
android-app
ios-app

రేపు ఒక్కరోజే 9 చిన్న సినిమాలు విడుదల! విజేత ఎవరో?

  • Published Feb 22, 2024 | 5:53 PMUpdated Feb 23, 2024 | 12:17 PM

This week OTT Releases: టాలీవుడ్ లో రేపు ఒక్క రోజే వరుస సినిమాలు థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకి ఆ సినిమాలేవంటే..

This week OTT Releases: టాలీవుడ్ లో రేపు ఒక్క రోజే వరుస సినిమాలు థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకి ఆ సినిమాలేవంటే..

  • Published Feb 22, 2024 | 5:53 PMUpdated Feb 23, 2024 | 12:17 PM
రేపు ఒక్కరోజే 9 చిన్న సినిమాలు విడుదల! విజేత ఎవరో?

టాలీవుడ్ లో ప్రతివారం ఏదో ఒక్క కొత్త సినిమా ప్రేక్షకులను అలరిస్తునే ఉంటుంది. ఇటీవలే హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా గతవారం థీయేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో మొదలై కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది. కానీ, బ్లాక్ బస్టర్ దిశగా మాత్రం అడుగులు వేయడంలో ఈ సినిమా విఫలమైంది. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో గతకొన్ని రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలన్ని ఒకేసారి బరిలోకి దిగడం అనేది ఇది వరకే చూశాం. ఈ క్రమంలోనే.. ఇప్పుడు చిన్న తరహా హీరోల సినిమాలన్ని ఒకే రోజున రేస్ లో దిగాడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా రేపు అనగా శుక్రవారం ఫిబ్రవరి 23న ఏకంగా తొమ్మిది సినిమాలు తమ అదృష్టాన్ని బాక్సాఫీస్ వద్ద పరీక్షించుకోడానికి రెడీ అవుతోంది. ఇక సినీ ప్రియులకు ఇది ఒక శుభవార్తనే చెప్పవచ్చు. మరి ఆ సినిమాలేవంటే..

ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలు రేస్ లో ఉండటం తప్ప.. చిన్న తరహా హీరోల సినిమాలు బరిలోకి దిగడం ఎప్పుడు జరగలేదు. కానీ తాజాగా రేపు ఒక్కరోజే ఏకంగా 9 సినిమాలు బరిలోకి దిగడంతో.. ఇది ఒక మినీ వార్ లానే కనిపించనుంది. ఇంతకి ఆ సినిమాలేవంటే.. కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’.ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వడంతో ప్రేక్షకుల్లో సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా ఎంతమేరకు ఓపెనింగ్స్ వస్తాయనేది మూవీ టాక్ ని బట్టి చూడాల్సి ఉంటుంది. అలాగే మరో కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’. అయితే ఈ సినిమా ఎక్కువగా యూత్ ని నమ్ముకుని బరిలో దిగుతోంది. అయితే ఈ సినిమా బాగుందని టాక్ వినిపిస్తే సినిమా సక్సెస్ పై అంచనాలు పెరగవచ్చు. ఇక దీంతోపాటు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. ఇది పూర్తిగా రాజకీయం కథకుసంబంధించినదే కాబట్టి ప్రత్యేకంగా వైసిపి నాయకులు తప్ప సాధారణ ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి ఉండదు. అలాగే మలయాళం సూపర్ స్టార్ మమ్ముటీ  నటించిన ‘భ్రమ యుగం’. ఇది సెన్సేషన్ గా నిలిచిన బ్లాక్ అండ్ వైట్ మూవీ కావడంతో పాటు.. దీనిని సితార సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడంతో మంచి రిలీజ్ దక్కుతోంది. అయితే ప్రమోషన్లు లేని కారణంగా పబ్లిక్ లో అంతగా టాక్ వినిపించడం లేదు.

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్నా సినిమా ‘సిద్దార్థ్ రాయ్’. ఈ సినిమాను యువ దర్శకుడు తెరకెక్కించనున్నారు. అలాగే ఇవి కాకుండా.. ‘ముఖ్య గమనిక’, ’14 డేస్ లవ్’, ‘ప్రేమలో ఇద్దరు’, ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతిలు’ రేస్ లో ఉన్నాయి. వాటితో పాటు బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్-ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆర్టికల్ 370’తో పాటు తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ హీరోగా నటించిన ‘క్రాక్’ వంటి సినిమాలు బాలీవుడ్ నుంచి బరిలోకి దిగనున్నాయి. ఇక ఇన్ని సినిమాల మధ్య ప్రేక్షకులు ఏ సినిమా చూడలని తెగ ఆందోళన ఉంటారు. మరి, రేపు విడుదల కానున్న ఈ 9 సినిమాల్లో మీకు నచ్చన సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి