iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కు అస్వస్థత!

  • Published May 29, 2024 | 10:05 AM Updated Updated May 29, 2024 | 10:05 AM

Star Director VV Vinayak Fell Ill: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఆరోగ్యం బాగోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో ఉన్నారు అంటూ చెబుతున్నారు. ఇంటికే పరిమితం అయ్యారు అంటూ చెప్పుకొస్తున్నారు.

Star Director VV Vinayak Fell Ill: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఆరోగ్యం బాగోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో ఉన్నారు అంటూ చెబుతున్నారు. ఇంటికే పరిమితం అయ్యారు అంటూ చెప్పుకొస్తున్నారు.

  • Published May 29, 2024 | 10:05 AMUpdated May 29, 2024 | 10:05 AM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కు అస్వస్థత!

వీవీ వినాయక్.. టాలీవుడ్ లో ఉన్న విలక్షణ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు. వీవీ వినాయక్ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకుల్లో కొత్త జోష్ వచ్చేస్తుంది. వీవీ వినాయక్ తీసిన సినిమాల్లో ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉండే సినిమాలు, మరొక్కసారి అయినా చూడాలి అనిపించే సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వీవీ వినాయక్ నుంచి టాలీవుడ్ లో సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. ఇటీవల బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాని రీమేక్ చేశాడు. కానీ, టాలీవుడ్ లో మాత్రం మూవీ ఊసే లేదు. వీవీ వినాయక్- మెగాస్టార్ కాంబోలో మూవీ వస్తోంది అని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అసలు వీవీ వినాయక్ ఆరోగ్యం బాగాలేదు అనే వార్తలు అభిమానులను కంగారు పెడుతున్నాయి.

వీవీ వినాయక్ కాస్త బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. బెల్లకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. కానీ, తెలుగులో సినిమా గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. దిల్ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా స్టార్ట్ చేసిన సీనయ్య సినిమా సంగతి ఇంకా తెలియరాలేదు. అయితే ఈ గ్యాప్ లో వీవీ వినాయక్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కథ కూడా రెడీగా ఉందని చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం వీవీ వినాయక్ ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదని.. ఇంటికే పరిమితమయ్యారు అంటున్నారు.

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఆరోగ్యం విషయంలో టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన ఆరోగ్యం బాగోలేదు అంటూ చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏవో ఇబ్బందులు తలెత్తాయి అంటున్నారు. ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆయన శారీరకంగా బాగా తగ్గిపోయారు అంటున్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించి కొందరు ఆయన సోదరుడు విజయ్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. వీవీ వినాయక్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. ఈ అనారోగ్యానికి సంబంధించిన వార్తలు అన్నీ ఇప్పటివి కాదని.. గతంలో వచ్చిన ఆరోగ్య సమ్యసలు అంటూ స్పష్టం చేశారు.

వీవీ వినాయక్ ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అంటూ సోదరుడు విజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్వరలోనే నంది హిల్స్ లోని ఆఫీస్ కు వస్తారని వెల్లడించారు. ప్రస్తుతం వీవీ వినాయక్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వినాయక్ నుంచి కొత్త సినిమాని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే అంతకన్నా ముందు అదుర్స్ కి సీక్వెల్ తీయాలి అంటూ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిక్వెస్ట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కోనా వెంకట్.. అదుర్స్ 2 తీస్తారు తీయాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేయడంతో మరోసారి అదుర్స్ 2పై చర్చ మొదలైంది. వీవీ వినాయక్ కు అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio