iDreamPost
android-app
ios-app

సంక్రాంతి రిలీజెస్: వచ్చేది ఎవరు? ఆగేది ఎవరు?

Tollywood Sankranthi Releases: సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సందడి నెలకొంటుంది. ఈ సంక్రాంతికి దాదాపు 5 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

Tollywood Sankranthi Releases: సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సందడి నెలకొంటుంది. ఈ సంక్రాంతికి దాదాపు 5 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

సంక్రాంతి రిలీజెస్: వచ్చేది ఎవరు? ఆగేది ఎవరు?

ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన హిట్ చిత్రాల కారణంగా సినీ అభిమానులు సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. విడుదలైన ప్రతి చిత్రానికి తమ అభిమాన హీరోలపై ఉన్న ప్రేమను కనబరచడం చూస్తూనే ఉన్నాము. ఇంకా వచ్చే సంవత్సరం సంక్రాంతికి సందడి చేయడానికి మరిన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. వారిలో స్టార్ హీరో చిత్రాలు కూడా ఉండడంతో ఏ చిత్రాలను విడుదల చేయాలి.. ఏ చిత్రాలను పోస్ట్ పోన్ చేయాలి అనే చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన చర్చల్లో ఒకటి, రెండు చిత్రాలను పోస్ట్ పోన్ చేయమని అడుగగా వారు ససేమిరా ఒప్పుకోలేదని సమాచారం.

ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెల్సిందే. ఇక తేజ సజ్జ నటించిన హనుమాన్ కూడా అదే రోజున రిలీజ్ ప్రకటించారు. రెండు చిత్రాలు ఒకటే రోజు కాకుండా ఒక రోజు ముందు హనుమాన్ ను విడుదల చేస్తే బావుంటుందేమో అనే మాటకు కూడా ఎటువంటి స్పందన లభించలేదంట. పోనీ మిగిలిన వారిలో ఎవరో ఒకరు న్యూ ఇయర్ కానుకగా వారి చిత్రాన్ని రిలీజ్ చేస్తే బావుంటుందేమో అనే ఆలోచన కూడా వర్క్ అవుట్ అవ్వలేదట. వీరంతా ఇంత కచ్చితంగా ఉండటానికి కారణం లేకపోలేదు. ఈ సంక్రాంతికి కానుకగా వచ్చేందుకు రెడీగా ఉన్న చిత్రాల సంఖ్య 5. కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ ఐదు చిత్రాలకు సరిపడా థియేటర్లు అందుబాటులో లేవు. ఒకవేళ థియేటర్ కు ఒక చిత్రం చొప్పున విడుదల చేసినా.. ఆడియన్స్ మహేష్ బాబు లాంటి స్టార్ చిత్రానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోవాల్సి ఉంటుంది.

కాబట్టి  ఆ ప్రాంతాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నా సరే.. పెద్ద హీరోల చిత్రాలకు మాత్రం కనీసం రెండు స్క్రీన్ లను కేటాయించాల్సిందే. ఈ విషయమై టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లు అందరూ చర్చలు జరుపుతున్నా.. ఒక కొలిక్కి రావడం లేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదీ కాకుండా ఈ చిత్రాలన్నీ ఒక దానితో ఒకటి పొంతన లేవు.. దేనికవే డిఫరెంట్ జానర్స్ కావడంతో, ఇది కూడా ఒక సమస్యగా మారింది. ఈ చిత్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పబ్లిసిటీలు జరగడం లేదు. సమయం కూడా ఎంతో లేదు. కాబట్టి ఏదేమైనా, త్వరలో వారంతా ఒక నిర్ణయాన్ని తీసుకుని దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటే బెటర్.

ఇక సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్న చిత్రాలు.. నా సామి రంగ, గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధ‌వ్‌. కాగా, జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్.. 13న ఈగల్, సైంధ‌వ్‌.. 14న నా సామి రంగ చిత్రాలు విడుదలకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ నటించిన అయలన్ చిత్రాలు. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్స్ ను ప్రకటించబోతున్నాయి. ఇక ఫైనల్ గా వీరిలో ఎవరు ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటారో.. ఎవరు తగ్గుతారో వేచి చూడాలి. మరి, ఈ చిత్రాల విడుదల డేట్స్ విడుదల విషయమై వినిపిస్తున్న టాక్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.