iDreamPost
android-app
ios-app

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతకు ప్రమాదం.. ఏం జరిగిందంటే..!

  • Published Jun 23, 2024 | 4:57 PM Updated Updated Jun 23, 2024 | 4:57 PM

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఒకరికి ప్రమాదం జరిగింది. గాయపడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన గురించి సదరు నిర్మాత చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు. .

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఒకరికి ప్రమాదం జరిగింది. గాయపడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన గురించి సదరు నిర్మాత చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు. .

  • Published Jun 23, 2024 | 4:57 PMUpdated Jun 23, 2024 | 4:57 PM
ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతకు ప్రమాదం.. ఏం జరిగిందంటే..!

టాలీవుడ్‌ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నిన్న అనగా శనివారం నాడు.. జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ ఒకరు రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. జబర్దస్త్‌ కార్యక్రమానికి స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేస్తోన్న మహ్మద్దీన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌కి వెళ్లడం కోసం భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.‌ తాను ఎక్కాల్సిన రైలు కదులుతుండటంతో.. రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కడం కోసం ప్రయత్నించి.. రైలు, ప్లాట్‌ ఫాం మధ్య ఇరుక్కుని చనిపోయాడు. దీన్ని మరవకుముందే.. మరో ప్రమాదం వెలుగు చూసింది. ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఒకరు ప్రమాదానికి గురయ్యారు. దీని గురించి నిర్మాత ట్వీట్‌ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ టాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌.. శశివదనే సినిమా నిర్మాత అహితేజ ప్రమాదానికి గురయ్యాడు. దీని గురించి ఆయనే ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. సరదాగా క్రికెట్ ఆడుతూ ఉండగా తలకి బలంగా బాల్ తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది గమనించిన అతడి స్నేహితులు.. వెంటనే అహితేజను హాస్పిటల్‌కు తీసుకెళ్లారట. అలా తన కోసం వెంటనే స్పందించి.. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఫ్రెండ్స్‌కు అహితేజ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. హాస్పిటల్‌లో చికిత్స చేశారని, ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపాడు. నిర్మాత అహితేజ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘శనివారం రాత్రి క్రికెట్ ఆడుతుండగా.. బాల్‌ వచ్చి బలంగా తాకింది.. తీవ్రంగా గాయమైంది.. అసలేం జరిగిందో అర్థం కాలేదు.. కాసేపు షాక్‌లో ఉండిపోయాను. పరిస్థితి గమనించిన నా మిత్రలు వెంటనే స్పందించి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తెల్లవారుఝాము వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాను.. చికిత్స అనంతరం నన్ను క్షేమంగా ఇంటి దగ్గర దిగబెట్టారు. ఈ సమయంలో నా స్నేహితులు చూపించిన ప్రేమ, చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను చెప్పేది ఒక్కటే.. క్రికెట్ ఆడే సమయంలో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి.. నేను చాలా లక్కీ అనిపిస్తోంది.. ఒక ఇంచ్ కింద గానీ.. ఒక ఇంచ్ పైన గానీ తగిలితే పరిస్థితి వేరేలా ఉండేది.. క్రికెట్‌ ఆడే సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొండి.. ఇది నా రిక్వెస్ట్‌ అంటూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అహితేజకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.