iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ హీరోయిన్లలో కుర్రాళ్ల న్యూ క్రష్ లిస్ట్.. ఫ్యూచర్ వీళ్లదే!

  • Published Jul 31, 2024 | 9:06 AM Updated Updated Jul 31, 2024 | 9:06 AM

Tollywood New Crush List- Future Star Heroines: టాలీవుడ్ లోకి ఇప్పుడు కొత్త భామలు వస్తున్నారు. వారి టాలెంట్ తో హిట్లు కొట్టడమే కాకుండా.. కుర్రాళ్ల గుండెలను బద్దలు కొట్టేస్తున్నారు. కుర్రాళ్లు అంతా తమ క్రష్ లిస్ట్ ని కూడా అప్ డేట్ చేసేస్తున్నారు.

Tollywood New Crush List- Future Star Heroines: టాలీవుడ్ లోకి ఇప్పుడు కొత్త భామలు వస్తున్నారు. వారి టాలెంట్ తో హిట్లు కొట్టడమే కాకుండా.. కుర్రాళ్ల గుండెలను బద్దలు కొట్టేస్తున్నారు. కుర్రాళ్లు అంతా తమ క్రష్ లిస్ట్ ని కూడా అప్ డేట్ చేసేస్తున్నారు.

  • Published Jul 31, 2024 | 9:06 AMUpdated Jul 31, 2024 | 9:06 AM
టాలీవుడ్ హీరోయిన్లలో కుర్రాళ్ల న్యూ క్రష్ లిస్ట్.. ఫ్యూచర్ వీళ్లదే!

టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఏమో గానీ.. హీరోయిన్స్ కు మాత్రం స్టార్డమ్ రావాలి అంటే కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. సినిమాలు భారీ విజయాలు సాధించినా కూడా.. కొందరు భామలకు ఆ స్టార్డమ్ రాదు. కానీ, కొందరికి మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ఎక్కడి లేని క్రేజ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా.. కుర్రాళ్లు తమ క్రష్ లిస్ట్ అప్ డేట్ చేసుకుని చాలా రోజులు అవుతోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ని యంగ్ హీరోయిన్స్ షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా.. ఈ హీరోయిన్స్ దే ఫ్యూచర్ అని.. కాబోయే స్టార్స్ వీళ్లే అంటూ చాలానే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. ఆ భామలు ఎవరు? అంత క్రేజ్ కి కారణం ఏంటో చూద్దాం.

భాగ్యశ్రీ బోర్సే:

టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హీరోయిన్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా చేసిన భాగ్యశ్రీ బోర్సే. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కాబోతోంది. అందుకే మూవీ టీన్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ బాగా హైలెట్ గా నిలుస్తోంది. నెట్టింట ఎక్కడ చూసినా కూడా భాగ్యశ్రీ బోర్సే డ్యాన్సులు, ఫొటోలు, మాటలే కనిపిస్తున్నాయి. కుర్రాళ్లు అంతా తమ క్రష్ లిస్టులో ఈమె పేరును యాడ్ చేసేశారు.

Bhagyasri

కావ్య థాపర్:

ఇంక టాలీవుడ్ లో ఇంకో సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు అంటే అది డబుల్ ఇస్మార్ట్ అనే చెప్పాలి. పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న ఈ సీక్వెల్ లో కావ్యా థాపర్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీలో పూరీ డైలాగులు, రామ్ స్టెప్పులు మాత్రమే కాదు.. కావ్య థాపర్ డ్యాన్సులు కూడా హైలెట్ అవుతున్నాయి. ఈ మూవీ కూడా ఆగస్టు 15కే వచ్చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన మార్ ముంత- చోడ్ చింత సాంగ్, ఏ క్యా లఫ్డా సాంగ్స్ తో కావ్య థాపర్ కు మంచి అప్లాజ్ లభిస్తోంది. అలాగే క్రష్ లిస్ట్ లో అప్ డేట్ చేసుకుని ఫాలోయింగ్ కూడా స్టార్ట్ చేశారు.

kavya

మీనాక్షి చౌదరీ:

టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఈ అమ్మడు పేరు బాగా వినిపిస్తోంది. ఇప్పటికే మంచి హిట్లు అందుకుంది. అలాగే టాలీవుడ్ నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా మీనాక్షి చౌదరికి మంచి ఫాలోయింగే ఉంది. ఇప్పుడు ఫాలోయింగ్ పెరగడమే కాకుండా.. రాబోయే కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది అంటూ అభిప్రాయాలూ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో మీనాక్షికి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Meenakshi

తృప్తి ధిమ్రీ:

ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఈ హీరోయిన్ ని తమ క్రష్ లిస్టులో చేర్చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా- రణ్ బీర్ కపూర్ కాంబోలో వచ్చిన్ యానిమల్ చిత్రంలో తృప్తి ధిమ్రీ కేవలం 15 నిమిషాల సేపు మాత్రమే కనిపించింది. కానీ, ఆ కాసేపట్లోనే కుర్రాళ్లు ఈమెను తమ క్రష్ గా ఫిక్స్ అయిపోయారు. ఎంతలా ఫాలో అవుతున్నారు అంటే.. ఈమె రీసెంట్ గా చేసిన బ్యాడ్ న్యూజ్ సినిమాని కూడా తెగ వైరల్ చేశారు. టాలీవుడ్ లో తృప్తికి మంచి క్రేజ్ వచ్చేసింది. ఆమెను వచ్చే మరికొన్ని ప్రాజెక్ట్స్ లో తెలుగులో చూస్తాం అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

Tripthi

మాలవిక శర్మ:

మాలవిక శర్మ.. ఇటీవల వచ్చిన సుధీర్ బాబు హరోంహర, అంతకంటే ముందు వచ్చిన మ్యాచోమ్యాన్ గోపీచంద్ భీమా సినిమాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ గా నటించింది. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. అలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ పడితే.. ఈ అమ్మడు కచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాని త్వరగానే అందుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతానికి కుర్రాళ్లు మాత్రం తమ క్రష్ లిస్టులోకి ఈమె పేరును యాడ్ చేసుకున్నారు.

Malavika sharma

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom