Arjun Suravaram
Sunaina Engagement Photo: ఇటీవల కాలంలో సినీ రంగంలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒక్కొక్కరిగా వివాహం బంధంలోకి అడుగుపెడుతు..కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధమైంది.
Sunaina Engagement Photo: ఇటీవల కాలంలో సినీ రంగంలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒక్కొక్కరిగా వివాహం బంధంలోకి అడుగుపెడుతు..కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధమైంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో సినీ రంగంలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒక్కొక్కరిగా వివాహం బంధంలోకి అడుగుపెడుతు..కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలానే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి వంటి వారు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అలానే మరికొందరు యంగ్ యాక్టర్స్ ఇదే బాటలో వెళ్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధమైంది. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఎంగెజ్మెట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంతకీ ఆ లేడీ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దా…
టాలీవుడ్ హీరోయిన్ సునయన పెళ్లికి సిద్ధమైంది. ఈ బ్యూటీ కుమార్ వర్సెస్ కుమారి అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించిన అంతగా క్రేజ్ సంపాదించలేక పోయింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాక కుర్రాళ్లల్లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి. గతేడాది రెజీనా చిత్రంతో సునయన ప్రేక్షకులను పలకరించింది.
ఈ ఏడాది ఇన్ స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. అలా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఈ బ్యూటీ చాలా బిజీ బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ అందరికి ఒక గుడ్ న్యూస్.. తనను ఆరాధించే కుర్ర ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తనకు పెళ్లి నిశ్చితార్ధం జరిగిందని వెల్లడించింది. కాబోయే భర్త వేలును పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాక ఫోటోతో పాటు తన నిశ్చితార్థం జరిగిందని రాసుకొచ్చింది. విషేష్ చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే తాను వివాహం చేసుకోబోయేది వ్యక్తి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు.
ఇక సునయన సినిమా విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. తొలి సినిమాతో మంచి మార్కులు పొందిన ఈ అమ్మడు కాదలిల్ విడుదెన్(2008) ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. నీర్పరవై అనే చిత్రం ఈ అమ్మడిని మరో మెట్టు ఎక్కించింది. టాలీవుడ్ లో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర అనే సినిమాలో నటించింది. అలానే చంద్రగ్రహణం, మీట్ క్యూట్ అనే సిరీస్‌లతో ఓటీటీ ప్రియులకు మరింత దగ్గరైంది. మొత్తంగా అమ్మడి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Hi, I’ve seen some articles going around regarding my last post and wanted to clarify that I am indeed happily engaged.
Thank you for all the wonderful messages that are coming in, it means so much ❤️ pic.twitter.com/CdVGVjKJyk
— Sunainaa (@TheSunainaa) June 7, 2024