Swetha
Balakrishna, Pawan Kalyan Multistarer: టాలీవుడ్ లో టైర్ వన్ హీరోల సింగల్ స్టారర్ మూవీస్ చూడాలని ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో.. మల్టీ స్టారర్ మూవీస్ చూడాలని కూడా అలానే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ మూవీ దాదాపు ఒకే అనుకునే టైమ్ లో మిస్ అయిపోయిందట.
Balakrishna, Pawan Kalyan Multistarer: టాలీవుడ్ లో టైర్ వన్ హీరోల సింగల్ స్టారర్ మూవీస్ చూడాలని ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో.. మల్టీ స్టారర్ మూవీస్ చూడాలని కూడా అలానే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ మూవీ దాదాపు ఒకే అనుకునే టైమ్ లో మిస్ అయిపోయిందట.
Swetha
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తమ అభిమాన నటి నటులను ఒకే తెరపై చూసేందుకు ఆశ పడుతూ ఉంటారు. ఇప్పటివరకు మల్టీ స్టారర్ మూవీస్ చాలానే వచ్చాయి. అనుకున్నట్లుగానే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించాయి. టాలీవుడ్ లో టైర్ వన్ హీరోల సింగల్ స్టారర్ మూవీస్ చూడాలని ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో.. మల్టీ స్టారర్ మూవీస్ చూడాలని అంత కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలాంటి క్రేజి కాంబినేషన్స్ ఎన్ని వచ్చినా కానీ.. ప్రేక్షకులకు ఇంకా ఇంకా చూడాలనే ఆశ మాత్రం తీరదు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ మూవీ దాదాపు ఒకే అనుకునే టైమ్ లో మిస్ అయిపోయిందట.
సరిగ్గా సంవత్సరం క్రితం.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గరకు ఓ మంచి మల్టీ స్టారర్ కథ వచ్చిందట. అయితే ఈ నిర్మాత ఇప్పటివరకు ఇండస్ట్రీ లో అందరి పెద్ద హీరోలతో చేసాడు కానీ.. బాలకృష్ణతో మాత్రం ఛాన్స్ రాలేదు. దీనితో ఆ సమయంలో వచ్చిన కథ కరెక్ట్ గా బాలయ్య , పవన్ కళ్యాణ్ కు సెట్ అవుతుందని అనిపించి.. ఆయన ఆ కథను బాలయ్య దగ్గరకు తనకు తెలిసిన దర్శకులతో కథ చెప్పడానికి మీటింగ్ అరేంజ్ చేశారు. ఓ మంచి మల్టీ స్టారర్ మూవీ ఉంది అని ఆ నిర్మాత అనగానే.. అప్పటికే బాలకృష్ణకు పవన్ తో మంచి ర్యాపో కూడా ఉండడంతో.. కథ వినడానికి బాలయ్య కూడా ఒకే అనేసారు. కానీ అసలు చిక్కంతా అప్పుడే వచ్చి పడింది. ఓ పెద్ద స్టార్ హీరో ముందు కూర్చుని కథ చెప్పడం ఆ దర్శకుడిగా తొలిసారి కావడంతో.. కంగారులో చెప్పాల్సిన కథను సరిగ్గా కన్వే చేయలేకపోయారట. ఇక ఏముంది బాలయ్య కూడా ఇదేం కథ నాకు నచ్చలేదని నో చెప్పేశారట. దీనితో బాలకృష్ణ, పవన్ మల్టీ స్టారర్ కథ అడ్డం తిరిగింది. వెండి తెరపై ఓ క్రేజి కాంబో మిస్ అయిపొయింది.
అయితే ఆ నిర్మాత మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా.. ఈ కథ కాకపోతే మరొకటి అంటూ.. ఇప్పటికి పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ కాంబినేషన్ కు సూట్ అయ్యే కథను వెతికే పనిలోనే ఉన్నారట. మరి ఈ క్రేజి కాంబినేషన్ కు తగినట్లు ఏ రచయిత కథ రాస్తారో.. అది ఎప్పటికి ఒకే అవుతుందో.. తెరపైకి ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఒకవేళ అలాంటి పర్ఫెక్ట్ కాంబినేషన్ లో కనుక సరైన కథ పడితే మాత్రం.. ఇండస్ట్రీ లో తిరుగులేని సినిమాలలో ఈ సినిమా కూడా ఓ సినిమాగా నిలిచిపోతుందని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఆ నిర్మాత కల.. ప్రేక్షకుల కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.