iDreamPost
android-app
ios-app

Pic Talk: నాలుకపై శూలం, దేవుడికి తలనీలాలు.. ఇంతకీ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా !

  • Published Jun 17, 2024 | 8:02 AMUpdated Jun 17, 2024 | 8:02 AM

ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలతోనే సినీ ఇండస్ట్రీలో.. మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఎంతో మంది సెలెబ్రిటీలు.. ఇప్పుడు అసలు ఏ మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే నటి కూడా అంతే. మరి ఆ నటి ఎవరో చూసేద్దాం.

ఇప్పుడు సోషల్ మీడియాలో.. స్టార్ సెలెబ్రిటీల చిన్నప్పటి ఫొటోస్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక అది మాత్రమే కాకుండా.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు.. ఇప్పుడు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో అనే ఆరా కూడా అభిమానులలో పెరిగిపోవడంతో.. స్టార్ సెలెబ్రిటీల ఫొటోలు అప్పుడు.. ఇప్పుడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సెలెబ్రిటీ కూడా ఈ కోవకు చెందిన వారే. అసలు ఈ నటి ఇంతలా మారిపోతుందని ఎవరు ఊహించి ఉండరు. మరి ఈ నటి ఎవరు .. ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎలా ఉంది అనే విషయాలను చూసేద్దాం.

ఇక్కడ ఫొటోలో.. తలనీలాలు సమర్పించి.. గుండుతో కనిపిస్తున్న.. నటి ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. అలాగే కొన్ని సినిమాలో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించింది. తెలుగులో అయితే ఈ నటి చేసిన సినిమా కేవలం ఒక్కటే… అయినా సరే ఆ ఒక్క సినిమాతోనే ఎంతో మంది యూత్ గుండెల్లో తన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా కూడా.. ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాక.. హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఇంతకీ ఈమె ఎవరు ఇప్పటికైనా గుర్తిచ్చిందా ! ఈమె మరెవరో కాదు.. 10th క్లాస్ సినిమాలో హీరోయిన్ గా చేసిన.. శరణ్య. ఈమె రీసెంట్ గా తమిళనాడులోని.. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని.. అక్కడ ఆమె తన తల నీలాలలను సమర్పించుకుంది. దీనితో ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన అభిమానులు.. శరణ్యను గుర్తించేందుకు కాస్త టైమ్ తీసుకున్నారు. సహజంగా.. తల నీలాలు సమర్పించేందుకు అమ్మాయిలు చాలా ఆలోచిస్తారు. కానీ శరణ్య మాత్రం ఇలా తన తలనీలాలను సమర్పించి . ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అభిమానులు ఆమెపై ప్రశంసలతో ముంచేస్తున్నారు. 10th క్లాస్ సినిమా కంటే ముందు .. ఆమె నీ మనసు నాకు తెలుసు మూవీ లో ఓ కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపించింది. ఈ సినిమాలే కాకుండా మైకం, దూసుకెళ్తా లాంటి చిత్రాలలో కూడా ఈ అమ్మడు నటించింది. మరి శరణ్య లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Sharanya Nagh (@sharanya_nagh)

View this post on Instagram

A post shared by Sharanya Nagh (@sharanya_nagh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి